ఆస్తి కోసం తల్లిని నరికి చంపిన కొడుకు
Man hacks mother to death with axe over land dispute in UP's Hamirpur. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో ఓ వ్యక్తి తన 50 ఏళ్ల తల్లిని గొడ్డలితో
By Medi Samrat Published on 8 Jun 2022 2:45 PM ISTఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో ఓ వ్యక్తి తన 50 ఏళ్ల తల్లిని గొడ్డలితో నరికి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు కుసుమ్ సాహుకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆస్తిని తన పేరు మీదకు బదలాయించాలని నిందితుడు మదన్ తల్లిపై ఒత్తిడి తెస్తూ ఉండేవాడు. అందుకు ఆమె నిరాకరించింది. ఆస్తి విషయంలో తీవ్ర వాగ్వాదానికి దిగిన నిందితుడు మదన్.. ఆవేశంతో తల్లిని గొడ్డలితో నరికి చంపాడు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన యూపీలోని ఇటేలియా బజా పోలీస్ స్టేషన్ పరిధిలోని హమీర్‌పూర్‌లో నమోదైంది. సమాచారం అందుకున్న జరియా పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రామ్ అస్రే సరోజ్, సర్కిల్ ఆఫీసర్ అఖిలేష్ కుమార్ ఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, నిందితుడు మదన్ వృత్తిరీత్యా కూలీ.. అతని తండ్రి, తమ్ముళ్లతో కలిసి ఢిల్లీలో నివసిస్తున్నాడు. మూడు నెలల క్రితం హమీర్‌పూర్‌లోని స్వగ్రామానికి వచ్చిన అతను తన తల్లితో ఆస్తి సమస్యలపై గొడవ పడుతూనే ఉండేవాడు. హమీర్‌పూర్ ఎస్పీ అనూప్‌కుమార్ మాట్లాడుతూ.. భూవివాదాల కారణంగా నిందితుడు, అతని వృద్ధ తల్లి తరచూ గొడవ పడుతుండేవారని, ఆస్తిని తన పేరున బదలాయించాలంటూ మదన్ తల్లిపై ఒత్తిడి పెంచుతుండగా ఆమె నిరాకరించిందని అన్నారు. మంగళవారం గొడవ హింసాత్మకంగా మారింది. మదన్ తన తల్లిని గొడ్డలితో నరికి చంపాడు. నిందితుడు తన తల్లిని చంపిన తర్వాత అక్కడి నుండి పారిపోయాడు. అతనిని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.