ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఒక వ్యక్తి చోరీ చేసే ఉద్దేశంతో ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. అయితే ఇంట్లో ఉన్న మహిళలు ఏమాత్రం భయపడకుండా అతడిని ధైర్యంగా పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటన మార్చి 21న మొరాదాబాద్‌లోని ఒక డాక్టర్ ఇంట్లో జరిగింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఒక వ్యక్తి దొంగతనం చేసే ఉద్దేశంతో రహస్యంగా ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో ఇంట్లోని మహిళలు భోజనం చేస్తున్నారు. ఏమాత్రం కంగారు పడకుండా చాలా ప్రశాంతంగా భోజనం మధ్యలో లేచిన ఆ మహిళలు అతడిని ఒక మూలకు నెట్టి చుట్టుముట్టారు. ఏడుగురు మహిళలు కలిసి ఆ దుండగుడిని చితకబాదడం ఆ వీడియోలో కనిపిస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తున్నారు. నిందితుడిని త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.