ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్ పూర్ ప్రాంతంలో 42 ఏళ్ల వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. గోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవ్‌కలి గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. బాధితులను ఇంద్ర కుమార్ మౌర్య, అతని భార్య సుశీల (38), కుమార్తె చాందిని (10), కుమారుడు ఆర్యన్ (8)గా పోలీసులు గుర్తించారు.
సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవ్ గ్రోవర్ మాట్లాడుతూ.. ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులను అప్రమత్తం చేశారు. పాక్షికంగా కాలిపోయిన పురుషుడి మృతదేహం, మహిళ మృతదేహం, రెండు పిల్లల మృతదేహాలు కనిపించాయి. మహిళ, పిల్లల మృతదేహాల మెడ పొత్తికడుపుపై కత్తి పోట్లులు ఉన్నాయని ఆయన చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మౌర్య మద్యం, జూదానికి బానిస అయ్యాడని, చాలా మంది వద్ద అప్పులు కూడా చేశాడని తెలిపారు.
ఫోరెన్సిక్ బృందం క్రైమ్ స్పాట్‌ను పరిశీలించి, మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపింది, "ఇంద్ర కుమార్ మొదట తన భార్య, పిల్లలను చంపి.. తరువాత నిప్పంటించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం దర్యాప్తులో ఉంది" అని అధికారి తెలిపారు.