Video : ట్రెడ్ మిల్ మీద రన్నింగ్ చేస్తూ కుప్ప‌కూలి పోయాడు..!

వర్కవుట్ చేస్తూ పలువురు గుండెపోటుకు గురై కుప్పకూలిన సందర్భాలు ప్రజల్లో ఆందోళనను పెంచుతూ ఉన్నాయి.

By Medi Samrat  Published on  3 Aug 2024 9:00 PM IST
Video : ట్రెడ్ మిల్ మీద రన్నింగ్ చేస్తూ కుప్ప‌కూలి పోయాడు..!

వర్కవుట్ చేస్తూ పలువురు గుండెపోటుకు గురై కుప్పకూలిన సందర్భాలు ప్రజల్లో ఆందోళనను పెంచుతూ ఉన్నాయి. ఇప్పుడు, ఘజియాబాద్‌లోని జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై నడుస్తున్న వ్యక్తి కుప్పకూలి చనిపోయాడు. బహుశా గుండెపోటుతో మరణించాడని భావిస్తూ ఉన్నారు. అతడు కుప్పకూలిన CCTV ఫుటేజ్ వైరల్‌గా మారింది.

ట్విట్టర్ యూజర్ సిరాజ్ నూరానీ షేర్ చేసిన వీడియోను “ఘజియాబాద్‌లోని వేవ్ సిటీ పోలీస్ స్టేషన్ ఏరియాలో జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై నడుస్తున్నప్పుడు బీమా ఏజెంట్ మరణించాడు. గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు." పోస్టు చేశారు. వీడియోలో.. జిమ్‌ లో ఉన్న మిగిలిన వ్యక్తులు ఆ వ్యక్తిపై కార్డియోపల్మోనరీ రెససిటేషన్ (CPR) చేస్తున్నట్టు చూడవచ్చు.

గత నెలలో జూలై 20న ఛత్రపతి శంభాజీ నగర్‌లోని జిమ్‌లో 54 ఏళ్ల వ్యాపారవేత్త కవల్‌జిత్ సింగ్ బగ్గా గుండెపోటుతో మరణించారు. CCTV ఫుటేజీలో బగ్గా వార్మప్ చేస్తూ ఉండగా.. కుప్పకూలిపోయాడు.

Next Story