రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో నాలుగు బ్యాగుల నగదుతో వెళ్తున్న వ్యక్తిని ఒడిశాలోని కటక్‌లో జనరల్ రైల్వే పోలీస్ (GRP), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సంయుక్త బృందం పట్టుకుంది. సోదాల అనంతరం అతని వద్ద నుంచి రూ.24.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.ఆ బ్యాగుల్లో రూ.10, రూ.20 నోట్లను నింపారు. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా బారీకి చెందిన వ్యక్తి అరుణ్ కుమార్ స్వైన్‌గా గుర్తించారు. అతను భువనేశ్వర్ నుండి న్యూఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు.
అధికారులు ప్రశ్నించగా, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో వేరొకరు తన నుండి బ్యాగులను తీసుకుంటారని చెప్పి ఓ వ్యక్తి ఈ బ్యాగులను తనకు ఇచ్చాడని అరుణ్ కుమార్ స్వైన్ చెప్పాడు. రైల్వే స్టేషన్‌లోనే స్వైన్‌కు ఎవరైనా బ్యాగులను అందజేశారా అనే విషయంపై ఆర్‌పిఎఫ్, జిఆర్‌పి అధికారులు సిసిటివి ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఆర్పీఎఫ్ ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించింది. ఈ ఘటనపై ఆదాయపు పన్ను శాఖకు కూడా సమాచారం అందింది.