సోదరిని అతి కిరాతకంగా పొడిచి చంపాడు.. ఆ తర్వాత తండ్రిపై..

Man brutally stabs sister to death, attacks father, nephew over property share dispute. ఆస్తి వాటా వివాదంలో ఒక వ్యక్తి తన సొంత సోదరిని కత్తితో పొడిచి చంపాడు.

By Medi Samrat  Published on  12 Jun 2022 8:15 PM IST
సోదరిని అతి కిరాతకంగా పొడిచి చంపాడు.. ఆ తర్వాత తండ్రిపై..

ఆస్తి వాటా వివాదంలో ఒక వ్యక్తి తన సొంత సోదరిని కత్తితో పొడిచి చంపాడు. తన తండ్రి, మేనల్లుడిపై కూడా దాడి చేశాడు. ఈ విషయమై మహేంద్రసింగ్ చావ్డా అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన అహ్మదాబాద్‌లోని రామోల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. రామోల్ లోని కృష్ణకుంజ్ సొసైటీలోని వారి నివాసం వెలుపల షైతాన్‌సింగ్‌ చావ్డా తన కుమార్తె, మనవడితో కలిసి నిద్రిస్తున్నప్పుడు నిందితులు తమపై దాడి చేశారని ఆరోపించారు.

కేసు నమోదు చేసిన తర్వాత, రామోల్ పోలీసులు మొబైల్ నెట్వర్క్ ద్వారా నిందితుడిని కనిపెట్టారు. పోలీసులకు అతడిపై అనుమానం రావడంతో అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన నిందితుడిని మహేంద్రసింగ్ చావ్డాగా పోలీసులు గుర్తించారు. ఫిర్యాదు మేరకు మహేంద్రసింగ్ బాధితురాలి ఇంట్లోకి చొరబడి సోదరి మన్హర్బాను దారుణంగా కత్తితో పొడిచాడు. మహేంద్రసింగ్‌ను ఆపడానికి ఆమె తండ్రి, కొడుకు ప్రయత్నించినప్పుడు, అతను వారిపై దాడి చేసి సంఘటన స్థలం నుండి పారిపోయాడు. ఈ ఘటన తర్వాత ముగ్గురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు, అక్కడ మన్హర్బా చనిపోయినట్లు ప్రకటించగా, మిగిలిన ఇద్దరు బాధితులకు చికిత్స అందిస్తూ ఉన్నారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిందితుడిపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) సెక్షన్ 302 మరియు 307 కింద అభియోగాలు మోపారు. నిందితుడిని విచారించగా తన సోదరికి ఇంటి వాటా ఇవ్వడం ఇష్టం లేకనే హత్య చేసినట్లు అంగీకరించాడు.
















Next Story