పెళ్లి చేసుకోమని అడిగిన ప్రియురాలిపై దాడి

Man beats up 19-year-old girlfriend for asking him to marry her in MP's Rewa. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో 24 ఏళ్ల యువకుడు తన 19 ఏళ్ల గ‌ర్ల్‌ఫ్రెండ్‌పై దారుణంగా దాడికి తెగ‌బ‌డ్డాడు.

By Medi Samrat  Published on  25 Dec 2022 5:00 PM IST
పెళ్లి చేసుకోమని అడిగిన ప్రియురాలిపై దాడి

మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో 24 ఏళ్ల యువకుడు తన 19 ఏళ్ల గ‌ర్ల్‌ఫ్రెండ్‌పై దారుణంగా దాడికి తెగ‌బ‌డ్డాడు. యువ‌తి పెళ్లి చేసుకోమని అడిగినందుకు అత‌డు ఆమెను విచ‌క్ష‌ణార‌హితంగా కొట్టడం వైర‌ల్ అయిన వీడ‌యోలో కనిపించింది. పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న‌లో పంకజ్ త్రిపాఠి అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ (SDOP) నవీన్ దూబే తెలిపిస వివ‌రాల ప్రకారం.. వీడియోలో ఉన్న వ్యక్తి మౌగంజ్ ప్రాంతంలోని ధేరా గ్రామ నివాసి. నిందితుడు, బాలిక మధ్య సంబంధం కలిగి ఉన్నారు. వారి మధ్య వాగ్వాదం జరగడంతో ఆ వ్యక్తి ఆమెను కొట్టాడని దూబే తెలిపారు.

వీడియోలో.. యువతి తనను పెళ్లి చేసుకోవాలని నిందితుడిని అడుగుతున్నట్లు చూడవచ్చు. ఆ మనిషి మొదట్లో చిరాకు పడతాడు. తర్వాత ఆమె ముఖంపై పదే పదే తన్నడం.. కింద ప‌డేసి కొట్టడం చూడ‌వ‌చ్చు. నిందితుడిని మొదట IPC సెక్షన్ 151 (ప్రజా శాంతికి విఘాతం కలిగించడం) కింద అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఫిర్యాదు చేయడానికి నిరాకరించడంతో విడుదల చేశారు. అయితే, దాడికి సంబంధించిన వీడియో బయటకు రావ‌డంతో.. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), ఇతర సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేశారు. అయితే.. 19 ఏళ్ల బాధిత యువ‌తి వీడియోను చిత్రీకరించిన వ్యక్తిపై ఫిర్యాదు చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.


Next Story