భార్యను చంపిన భర్త.. బావ‌ను కడతేర్చిన బామ్మర్దులు

జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాలో భార్యను హత్య చేశాడనే ఆరోపణలతో 30 ఏళ్ల వ్యక్తిని అతని బామ్మర్దులు, అత్తారింటి వాళ్ళు కొట్టి చంపారని పోలీసులు తెలిపారు.

By Medi Samrat
Published on : 27 Jun 2025 9:15 PM IST

భార్యను చంపిన భర్త.. బావ‌ను కడతేర్చిన బామ్మర్దులు

జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాలో భార్యను హత్య చేశాడనే ఆరోపణలతో 30 ఏళ్ల వ్యక్తిని అతని బామ్మర్దులు, అత్తారింటి వాళ్ళు కొట్టి చంపారని పోలీసులు తెలిపారు. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లుకైయా గ్రామంలో బుధవారం రాత్రి కుటుంబ వివాదంపై భర్త, భార్య మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో భర్త భార్యను కత్తితో పొడిచి చంపాడని ఒక అధికారి తెలిపారు. చోటేలాల్ హన్స్‌డా తన 25 ఏళ్ల భార్య మీనా ముర్ముని చంపాడు.

మీనాను ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ గిరిదిహ్‌ కు చెందినవారు. "మీనా ఇటీవల తన తల్లిదండ్రుల ఇంట్లో ఉంటోంది. ఆమెను తిరిగి తీసుకురావడానికి ఆమె భర్త తన అత్తమామల ఇంటికి వెళ్లాడు. బుధవారం రాత్రి ఒక విషయంపై వారి మధ్య గొడవ జరిగింది.. చోటేలాల్ తన భార్యను పొడిచి చంపాడు అని పోలీసులు తెలిపారు. హన్స్‌డా అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు.. కానీ మీనా కుటుంబ సభ్యులు, స్థానికులు అతన్ని కొట్టి చంపారు. పోలీసులు రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం పరీక్షలకు పంపారు.

Next Story