మహిళపై కొడవలితో దాడి చేశాడు.. మోటార్‌సైకిల్‌ను వదిలి పారిపోయాడు

Man Attacks Woman With Machete On Road In Kerala. కేరళలోని కొచ్చిలో శనివారం నాడు ఓ మహిళపై ఓ వ్యక్తి కొడవలితో దాడి చేశాడు.

By Medi Samrat  Published on  3 Dec 2022 5:15 PM IST
మహిళపై కొడవలితో దాడి చేశాడు.. మోటార్‌సైకిల్‌ను వదిలి పారిపోయాడు

కేరళలోని కొచ్చిలో శనివారం నాడు ఓ మహిళపై ఓ వ్యక్తి కొడవలితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కలూర్‌లోని ఆజాద్ రోడ్‌లో ఈ సంఘటన ఉదయం 11 గంటలకు చోటు చేసుకుంది. సాక్షుల ప్రకారం.. యువకుడు, ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం తర్వాత ఈ సంఘటన జరిగింది. మహిళల్లో ఒకరి తలపై కొడవలితో కొట్టేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించాడని, అయితే అక్కడే ఉన్న ఆ మహిళ స్నేహితురాలు అడ్డుకోగలిగింది. ఈ దాడిలో ఆమె చేతికి గాయమైంది.

అనంతరం ఆ వ్యక్తి తన మోటార్‌సైకిల్‌ను వదిలి పారిపోయాడు. గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో రక్తపు మడుగులో కొడవలి పడి ఉండడం కనిపించింది. దాడి చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దాడికి ఉపయోగించిన కొడవలిని స్వాధీనం చేసుకుని, స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.


Next Story