నెల్లూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం.. విద్యార్థిని గొంతుకోసిన యువకుడు

Man Attack On Inter Girl In Venkatagiri. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఉన్మాది పెట్రేగిపోయాడు. కాలేజీమిట్టలో చెంచు కృష్ణ అనే యువకుడు

By Medi Samrat  Published on  21 March 2022 6:01 AM GMT
నెల్లూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం.. విద్యార్థిని గొంతుకోసిన యువకుడు

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఉన్మాది పెట్రేగిపోయాడు. కాలేజీమిట్టలో చెంచు కృష్ణ అనే యువకుడు ఇంటర్ విద్యార్థి జ్యోతిక గొంతు కోశాడు. ప్రేమించడం లేదనే కోపంతో కాలేజీకి వచ్చిన 18 ఏళ్ల అమ్మాయిపై దాడికి తెగబడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.

స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం చెంచు కృష్ణ అనే యువకుడు గత కొన్ని రోజులుగా చిగురుపాటి జ్యోతిక ను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. ఆమె చదివే కళాశాల దగ్గరకు వెళ్లి మరీ వేధిస్తూ ఉన్నాడు. అందుకు జ్యోతిక నిరాకరిస్తూ వస్తోంది. తన ప్రేమను ఒప్పుకోవడం లేదన్న కారణంతో ఆమెపై కక్ష పెంచుకున్న కృష్ణ మద్యం సేవించి విద్యార్థినిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు నిందితుడిని చితకబాదారు. దాడిలో తీవ్రంగా గాయపడిన జ్యోతికను నెల్లూరు జిల్లా ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

Next Story
Share it