ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. సితార్‌గంజ్ పట్టణ పరిధిలోని ఓ ప్రాంతంలో 35 ఏళ్ల దుకాణదారుడిని అంకుల్ అని పిలిచినందుకు18 ఏళ్ల బాలికపై దాడికి దిగాడు. ఆమెను ఆ వ్యక్తి దారుణంగా కొట్టాడు. వివరాల ప్రకారం.. మంగళవారం జరిగిన ఈ ఆశ్చర్యకరమైన సంఘటనలో నిషా అహ్మద్ బాధితురాలిగా గుర్తించబడింది. 18 ఏళ్ల బాలిక తలకు బలమైన గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. నిందితుడు మోహిత్ కుమార్‌పై ఐపీసీ సెక్షన్ 354 (మహిళ తన నమ్రతపై దాడి చేయడం), సెక్షన్ 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), సెక్షన్ 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేయబడింది.
జరిగిన ఘటన గురించి ఎస్‌హెచ్‌వో మాట్లాడుతూ.. "నిషా అహ్మద్ డిసెంబరు 19న తాను కొనుగోలు చేసిన బ్యాడ్మింటన్ రాకెట్‌లోని కొన్ని తీగలు విరిగిపోయినట్లు గుర్తించిన తర్వాత దానిని మార్చుకోవడానికి ఖతిమా రోడ్‌లో ఉన్న ఒక దుకాణానికి వెళ్లింది. కానీ, ఆమె అతన్ని అంకుల్ అని సంబోధించడంతో దుకాణదారుడు కోపం తెచ్చుకున్నాడు. ఆమెను దారుణంగా కొట్టాడు. నిషాను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. పోలీసులు జోక్యం చేసుకున్న వెంటనే, నిషా తండ్రి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.