ఢిల్లీలోని నంద్ నగరి ప్రాంతంలో బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తుల నుంచి మొబైల్ ఫోన్లను దొంగిలించిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 28న రాత్రి 9:25 గంటల ప్రాంతంలో డీఎల్‌ఎఫ్ మోర్ సీమాపురి సమీపంలో ముగ్గురు వ్యక్తులు వచ్చి బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తుల నుంచి ఫోన్‌లు దోచుకున్నారు.
అరెస్టయిన వ్యక్తిని ఢిల్లీలోని న్యూ సీమాపురి నివాసి సమీర్ (27)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సీమాపురి పోలీస్ స్టేషన్ సిబ్బంది సమీర్‌ను అరెస్ట్ చేశారు. అతడు ఆ దొంగతనాలకు పాల్పడిన తన సహచరుల పేర్లను కూడా వెల్లడించాడు. తోటి దొంగలను సద్దాం, ముస్తాక్‌గా గుర్తించారు. ఇద్దరూ న్యూ సీమాపురి, ఢిల్లీ ప్రాంత నివాసితులే. నిందితులపై నంద్ నగ్రి పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 394/397/34 కింద కేసు నమోదు చేయబడింది.