రెండేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ట్యాంకులో పడేసి

Man arrested for sexually assaulting 2 year-old girl. కర్ణాటక రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ దుర్మార్గుడు రెండేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

By అంజి  Published on  2 Nov 2021 8:13 AM IST
రెండేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ట్యాంకులో పడేసి

కర్ణాటక రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ దుర్మార్గుడు రెండేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను నీళ్లు లేని ట్యాంకులో పడేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన మంగళూరులోని హోయి బజార్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. హెయి బజార్‌లో బిహార్‌కు చెందిన 30 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం చిన్నారి తల్లిదండ్రులు పని మీద బయటకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన బీహార్‌కు చెందిన చందన్ (38) బాలికపై అత్యాచారం చేశాడు. అనంతరం బాలికను నీళ్ల లేని ట్యాంకులో పడేసి వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చిన తల్లిదండ్రుకుల కూతురు కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. చుట్టు పక్కల వెతకగా రాత్రి 9 గంటల సమయంలో నీటి ట్యాంకులో చిన్నారిని గుర్తించారు.

స్పృహతప్పి ఉన్న చిన్నారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ప్రభుత్వ వెన్‌లాక్‌ ఆస్పత్రిలోని రీజనల్‌ అడ్వాన్స్‌డ్ పీడియాట్రిక్‌ కేర్‌ సెంటర్‌కు తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు.. చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో చందన్‌ ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలిసింది. చందన్‌ను లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టంలోని నిబంధనల ప్రకారం అరెస్ట్‌ చేశారు. పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శశికుమార్‌ చిన్నారి చికిత్స పొందుతున్న ఆస్పత్రిని సందర్శించారు. పని ప్రదేశంలో పిల్లల సంరక్షణకు సౌకర్యాలు లేకపోవడంపై కూలీల యజమానిని పోలీసులు వివరణ కోరుతున్నారు.

Next Story