Nirmal : తాగిన మైకంలో పసిబిడ్డపై పడుకుని ప్రాణం తీసిన తండ్రి

నిర్మల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సుభాష్ నగర్‌లో మంగళవారం తెల్లవారుజామున పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది.

By Medi Samrat
Published on : 22 May 2025 3:02 PM IST

Nirmal : తాగిన మైకంలో పసిబిడ్డపై పడుకుని ప్రాణం తీసిన తండ్రి

నిర్మల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సుభాష్ నగర్‌లో మంగళవారం తెల్లవారుజామున పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది. చీమన్‌పల్లి గ్రామానికి చెందిన అలకుంట శేఖర్ (22) వృత్తిరీత్యా కూలీ. సుజాత అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. సుజాత 28 రోజుల క్రితమే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవానంతరం ఆమె సుభాష్ నగర్‌లోని తన తల్లిగారింట్లోనే ఉంటోంది.

మంగళవారం తెల్లవారుజామున శేఖర్ మద్యం మత్తులో అత్తగారింటికి వెళ్లాడు. ఆ సమయంలో అతని భార్య సుజాత, వారి 28 రోజుల పసిపాప మంచంపై ఉన్నారు. భార్య, బిడ్డ మంచంపై ఉన్నారని తెలిసినప్పటికీ, శేఖర్ మద్యం మత్తులో అదే మంచంపై వారి పక్కనే పడుకున్నాడు. నిద్రమత్తులో అతడు పసికందుపై పడిపోయాడు. కొంతసేపటి తర్వాత పసికందు ముక్కు నుంచి రక్తం కారడం గమనించిన సుజాత, ఆమె తల్లి రాజమణి ఆందోళనకు గురయ్యారు. వెంటనే పాపను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శేఖర్‌‌ను అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story