విద్యార్థులకు మంచి బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు పాడు పని చేశాడు. విద్యార్థుల ఆన్‌లైన్ తరగతుల కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్‌లో అభ్యంతరకమైన చిత్రాలను పోస్టు చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షియోపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ చిత్రాలను చూసిన విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు.. వాట్సాప్ గ్రూప్‌లో పాడు చిత్రాలు పోస్టు చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ గ్రూప్‌లో అభ్యంతరకరమైన చిత్రాలను పోస్ట్ చేసినందుకు పాఠశాల ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు మంగళవారం ఒక అధికారి తెలిపారు.
ఇన్సాఫ్ మహమ్మద్ అనే ఉపాధ్యాయుడు కిలా షియోపూర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నాడు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కోసం రూపొందించిన వాట్సాప్ గ్రూప్‌లో సోమవారం ఉదయం అసభ్యకరమైన, అభ్యంతరకర చిత్రాలను పోస్ట్ చేసినట్లు తెలియడంతో సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) ఎస్‌కే సోలంకి ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (ప్రవర్తన) నిబంధనలను ఉల్లంఘించినందుకు ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.