విశాఖలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలు మృతి

Lovers Commits Suicide attempt in Visakhapatnam. విశాఖపట్నంలో పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి

By Medi Samrat  Published on  7 Jun 2022 6:23 PM IST
విశాఖలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలు మృతి

విశాఖపట్నంలో పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎయిర్ పోర్ట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ విషం సేవించి స్పృహతప్పి పడిపోయారు. అది గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అమ్మాయి అప్ప‌టికే చనిపోగా.. అబ్బాయి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.

వివరాల్లోకి వెళితే.. నేహా (17), కృష్ణ (19) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి ప్రతిపాదనతో పెద్దలను సంప్రదించారు. అయితే తల్లిదండ్రులు అందుకు నిరాకరించారు. మరోవైపు యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ప్రియురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు.









Next Story