నా మరణం.. నీకు పెళ్లి బహుమతి.. 'ఐ లవ్ యూ' అంటూ రాసి వన్ సైడ్ లవర్..
Lover committed suicide sharing video on WhatsApp. ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వన్ సైడ్ లవర్ అయిన
By Medi Samrat
ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వన్ సైడ్ లవర్ అయిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పర్రాస్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అతను ఆత్మహత్య చేసుకోడానికి ముందు తాను ప్రేమించిన అమ్మాయికి ఓ మెసేజీ ఉంచి వెళ్లడమే కాకుండా.. ఆత్మహత్యకు సంబంధించిన వీడియోను రూపొందించి వాట్సాప్ స్టేటస్‌లో అప్‌లోడ్ చేశాడు.
చనిపోడానికి ముందు ఆ వ్యక్తి గోడపై బొగ్గుతో 'నా చావు నీ పెళ్లి కానుక, ఐ లవ్ యూ' అని రాశాడని పోలీసులు తెలిపారు. ఆపై మెడకు ఉరి బిగించి కూడా వీడియో తీయడమే కాకుండా.. వాట్సాప్ స్టేటస్‌లో షేర్ చేశాడు. ఆ వ్యక్తి యువతిని ప్రేమించాడు. అతడి ప్రేమను యువతి ఒప్పుకోలేదు. సదరు యువతికి పెళ్లి కుదరడంతో.. ఆ వ్యక్తికి చాలా బాధ కలిగించింది. అందుకే అతడు ఈ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమించిన అమ్మాయి లేకుంటే తాను బ్రతకలేదని అతడు ఇటీవల తన సన్నిహితులతో చెప్పాడు. కానీ అతడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఎవరూ ఊహించలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు బలోద్ డీఎస్పీ ప్రతీక్ చతుర్వేది తెలిపారు. వీడియోను కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఇటీవల హర్యానాలోని చర్కి దాద్రీలో ఓ ప్రేమ జంట కుటుంబ సభ్యుల నుండి పెళ్లికి అనుమతి రాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అబ్బాయి-అమ్మాయి ఇద్దరూ రెండు రోజులుగా కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఇద్దరి కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. వారిద్దరూ ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే కులాల కారణంగా కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో వారిద్దరూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. వారిద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆ జంట ఖతీవాస్ రోడ్డులోని పొలాల్లోకి వెళ్లి చెట్టుకు ఉరివేసుకుని చనిపోయారు.