మొబైల్ ఫోన్ తిరిగి ఇవ్వలేదని ప్రియురాలిని చంపేశాడు..

lover brutally murdered his girlfriend. మొబైల్ ఫోన్ తిరిగి ఇవ్వలేదని ప్రియురాలిని ఓ ప్రేమికుడు దారుణంగా హత్య చేసిన దారుణ

By Medi Samrat  Published on  5 April 2022 9:00 PM IST
మొబైల్ ఫోన్ తిరిగి ఇవ్వలేదని ప్రియురాలిని చంపేశాడు..

మొబైల్ ఫోన్ తిరిగి ఇవ్వలేదని ప్రియురాలిని ఓ ప్రేమికుడు దారుణంగా హత్య చేసిన దారుణ ఘటన జార్ఖండ్‌లోని పాకూర్‌లో వెలుగు చూసింది. ఈ ఘటన మహేశ్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. నిందితుడు తన ప్రియురాలికి మొబైల్ బహుమతిగా ఇచ్చాడని పోలీసులు తెలిపారు. ఆ మొబైల్ ఫోన్ ను తిరిగి ఇవ్వాలని ప్రియురాలిని కోరగా.. ప్రియురాలు నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన ప్రేమికుడు ప్రియురాలిని హత్య చేశాడు.

పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. మృతురాలు తన 20 ఏళ్ల ప్రియుడితో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు బయటకు వెళ్లింది. అయితే ఆ తర్వాత ఆమె ఇంటికి తిరిగి రాలేదు. ఆ తర్వాత సోమవారం ఇంటి సమీపంలోని ఓ ప్రదేశంలో ప్రియురాలి మృతదేహం పడి ఉంది. ఆమె నిందితుడితో రెండేళ్లుగా అన్యోన్యంగా ఉందని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితుడు తరచూ బాలిక ఇంటికి వెళ్లేవాడు. కొద్ది రోజుల క్రితం అతడికి వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేశారు.

అప్పటి నుంచి తాను బహుమతిగా ఇచ్చిన మొబైల్‌ను తిరిగి ఇవ్వాలని ప్రియురాలిని కోరుతున్నాడు. అయితే ఆ యువతి మొబైల్ తిరిగి ఇవ్వడానికి నిరాకరించింది. ఆదివారం కూడా ఇదే విషయమై వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ గొడవలో అతడు ఆమెను హత్య చేశాడు. విచారణలో నేరస్థుడు తన నేరాన్ని అంగీకరించాడని పోలీసు అధికారి నవనీత్ ఆంథోనీ హెంబ్రామ్ తెలిపారు. వారిద్దరూ ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షించి తిరిగి వస్తుండగా ప్రియురాలిపై పదునైన వస్తువుతో దాడి చేశానని ఒప్పుకున్నాడు. అదే సమయంలో ప్రియురాలు మృతి చెందింది. ఆ తర్వాత ప్రేమికుడు స్మార్ట్‌ఫోన్‌తో పరారయ్యాడు. కంకరబోనా నుంచి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సదర్‌ ఆస్పత్రికి తరలించారు.













Next Story