తిరుప‌తి జిల్లాలో విషాదం.. ప్రేమ జంట ఆత్మ‌హ‌త్య‌

తిరుపతి జిల్లా భాకరాపేటలో విషాదం నెల‌కొంది. ఉరి వేసుకుని ప్రేమ జంట ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది.

By Medi Samrat  Published on  20 Aug 2023 7:35 PM IST
తిరుప‌తి జిల్లాలో విషాదం.. ప్రేమ జంట ఆత్మ‌హ‌త్య‌

తిరుపతి జిల్లా భాకరాపేటలో విషాదం నెల‌కొంది. ఉరి వేసుకుని ప్రేమ జంట ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. తిరుపతి- పీలేరు రహదారిలోని భాకరాపేట ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలోనున్న అటవీ ప్రాంతంలో ఘటన చోటుచేసుకుంది. మృతులను కళ్యాణి, యుగంధర్ గా పోలీసులు గుర్తించారు. చౌడేపల్లెకి చెందిన యుగంధర్, రామసముద్రం మండలం చిట్టెవారిపల్లికి చెందిన బోడి కళ్యాణి గ‌త కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ వివాహానికి పెద్దలు అడ్డు చెబుతుండడంతో ఈ నెల 18న‌ ఇంటి నుండి వెళ్లి ఇరువురు పెళ్లి చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. అటవీ ప్రాంతంలో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన జంట‌ను గుర్తించిన‌ స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామ‌ని ఇంచార్జ్ ఎర్రవారిపాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

Next Story