తిరుపతిలో ప్రేమ జంట ఆత్మహత్య

Love couple suicide in Tirupati. తిరుపతిలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్ప‌డింది. తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయ ఉత్త‌ర‌ మాడ వీధిలో

By Medi Samrat  Published on  8 Nov 2022 5:19 PM IST
తిరుపతిలో ప్రేమ జంట ఆత్మహత్య

తిరుపతిలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్ప‌డింది. తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయ ఉత్త‌ర‌ మాడ వీధిలో ఉన్న ఓ ప్రైవేటు లాడ్జిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. లాడ్జి సిబ్బంది స‌మాచారం మేర‌కు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు.. మృతుల‌ను తూర్పు గోదావరి కొవ్వూరు కి చెందిన అనూష, హైదరాబాద్ కు చెందిన కృష్ణారావుగా గుర్తించారు. ఏడాది క్రితం అనూషకు వేరే యువ‌కుడితో వివాహం చేశారు కుటుంబ సభ్యులు. ఇష్టం లేని పెళ్లి చేయడం.. ప్రేమికులు ఇద్ద‌రు క‌లిసి జీవించే అవ‌కాశం లేని కార‌ణాల‌తోనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలావుంటే.. ఈనెల మూడో తేదీన తూర్పు గోదావరి జిల్లా కోవూరు పోలీస్ స్టేషన్ లో అనూషపై మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.


Next Story