భార్య చెల్లెలితో ప్రేమాయణం.. చివరకు ఇలా..

Love affair with wife's sister .. Finally husband commits suicide. భార్య చెల్లెలితో ప్రేమాయణం చేసిన యువకుడు చివరకు తిరుపతిలోని ఓ లాడ్జీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన

By అంజి  Published on  29 Oct 2021 4:07 PM IST
భార్య చెల్లెలితో ప్రేమాయణం.. చివరకు ఇలా..

భార్య చెల్లెలితో ప్రేమాయణం చేసిన యువకుడు చివరకు తిరుపతిలోని ఓ లాడ్జీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన సాయి నవీన్‌కు గత నాలుగేళ్ల క్రితం కూకట్‌పల్లికి ఏరియాకు చెందిన ఓ యువతితో పెళ్లి జరిగింది. వీరి చిన్న బాబు ఉన్నాడు. భార్య మళ్లీ గర్బం దాల్చింది. గత కొంత కాలంగా భార్యభర్తల మధ్య కలహాలు వస్తున్నాయి. తరచూ కుటుంబ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇదే సమయంలో సాయినవీన్‌ తన భార్య చెల్లెలితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఈ విషయం కాస్తా భార్యకు తెలిసింది. దీంతో భార్య, వారి కుటుంబ సభ్యులు సొంతూరు గుడివాడకు వెళ్లారు.

దీంతో సూసైడ్‌ చేసుకుంటానని సాయినవీన్‌ తన భార్యను బెదిరింపులకు గురి చేశాడు. భర్త వ్యవహారంపై భార్య, వారి కుటుంబ సభ్యులు మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఫిర్యాదు చేశారు. భార్య చెల్లెలికి మాయమాటలు చెప్పిన సాయినవీన్‌.. మూడు రోజుల కిందట ఆమెను తిరుపతికి తీసుకొచ్చాడు. తిరుపతి నగరంలోని ఓ లాడ్జీలో గదిని అద్దెకు తీసుకుని ఉన్నారు. సాయి నవీన్‌ పెళ్లి చేసుకుందామని ప్రతిపాదన తేవడంతో.. అక్కకు అన్యాయం చేసి పెళ్లి చేసుకోలేనని ఆమె నిద్ర మాత్రలు మింగింది. దీంతో సాయినవీన్‌ లాడ్జీ గదిలో ఉరివేసుకుని సూసైడ్‌ చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. భార్య చెల్లెలు ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉంది.

Next Story