ఓ వ్యక్తి వైన్ షాపుకు వెళ్లి బీరు కావాలని అడగడంతో సేల్స్‌మెన్.. బీరు తీసుకువచ్చేందుకు ఫ్రిడ్జీ ర్యాక్ వద్దకు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన ఆ వ్యక్తి కౌంటర్‌లో ఉన్న డబ్బులు దొంగతనం చేసేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన సేల్స్‌మెన్ అతన్ని అడ్డుకోబోయాడు. దీంతో మరో ముగ్గురు వ్యక్తులు అక్కడి చేరుకొని.. సేల్స్‌మెన్‌ను తుపాకీతో బెదిరించి రూ.40 వేలను పట్టుకుని పరారయ్యారు. ఈ ఘటన గురుగ్రామంలోని శివాజీ నగర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రాత్రి పోలీస్ కమిషనర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ వైన్‌షాపుకి బీరు కోసం ఓ వ్యక్తి వచ్చాడు. బీరు కావాలని అడగడంతో సేల్స్‌మెన్ బీరు తెచ్చేందుకు లోపలికి వెళ్లాడు.
దీంతో కౌంటర్‌లో ఉన్న రూ.40 వేలను దొంగిలించేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించాడు. ఇది గమనించిన సేల్స్‌మెన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అదే సమయంలో మరో ముగ్గురు వ్యక్తులు వచ్చి తుపాకీతో బెదిరించి.. పరారయ్యారు. ఘటనా స్థలం నుండి నిందితులు వెళుతూ కాల్పులు జరిపారని పోలీసులకు సేల్స్‌మెన్ తెలిపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు తెల్లరంగులో పారిపోయారు. నలుగురు నిందితులపై శివాజీ పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 379, ఆయుధాల చట్టంలోని సెక్సన్ 25, 54, 59 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.