నిందితుడిని కోర్టులోకి తెచ్చారు.. న్యాయవాదులు చితకబాదారు..!

మైనర్ బాలికపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్ కేసులో అరెస్టయిన నిందితుడిని పోలీసులు కోర్టుకు తీసుకురాగా, ఆగ్రహంతో ఉన్న కొందరు న్యాయవాదులు, ప్రజలు అతడిపై దాడి చేశారు.

By -  Medi Samrat
Published on : 3 Feb 2026 4:15 PM IST

నిందితుడిని కోర్టులోకి తెచ్చారు.. న్యాయవాదులు చితకబాదారు..!

మైనర్ బాలికపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్ కేసులో అరెస్టయిన నిందితుడిని పోలీసులు కోర్టుకు తీసుకురాగా, ఆగ్రహంతో ఉన్న కొందరు న్యాయవాదులు, ప్రజలు అతడిపై దాడి చేశారు. కోహెఫిజా ప్రాంతంలో 11వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేసిన కేసులో ఒసాఫ్ అలీ ఖాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకురాగా, అప్పటికే అక్కడ గుమిగూడిన కొందరు న్యాయవాదులు అతడిని చితకబాదారు. పోలీసులు నిందితుడిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి పోలీసులు నిందితుడిని కోర్టు లోపలికి తీసుకెళ్లారు. గతేడాది జూలైలో నిందితుడు తనపై అత్యాచారం చేశాడని, ఆ సమయంలో రహస్యంగా వీడియో తీసి దానిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియో బయటపెట్టకుండా ఉండాలంటే లక్ష రూపాయలు డిమాండ్ చేయగా, భయంతో రూ. 40,000 చెల్లించింది. తన ఇష్టానికి విరుద్ధంగా ఇస్లామిక్ ప్రార్థనలు చేయమని బలవంతం చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

Next Story