ప్లాట్ ఫాంపై పడుకున్నాడని లేపితే పోలీసులను తిట్టడంతో కోర్టు ఏకంగా సంవత్సరం ఏడు నెలల పాటు జైలు శిక్ష విధించింది. 2020 నవంబర్ 24 అర్ధరాత్రి మారుతీ మొహితె అనే పోలీసు అధికారి సివిల్ డ్రెస్ లో ఉండి పాట్రోలింగ్ నిర్వహిస్తున్నాడు. సీఎస్ఎమ్టీ ప్లాట్ ఫాం 15పై ఓ వ్యక్తి పడుకుని ఉండటం గమనించి అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఆ మాటకు అతడు ఏం చేయాలో చేసుకొమ్మని సమాధానమిచ్చాడు. ఆ వ్యక్తిని పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లి ఐపీసీ సెక్షన్ 353, సెక్షన్ 504కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
2020లో జరిగిన ఈ ఘటనకు తాజాగా తీర్పు ఇచ్చింది కోర్టు. అసిస్టెంట్ సెషన్స్ జడ్జి ఆర్కే క్షీర్‌సాగర్ మాట్లాడుతూ పబ్లిక్ డ్యూటీ చేస్తుండగా అవమానం ఎదుర్కొన్నారని నిరూపితమైందని, నిందితుడు క్రిమినల్ చర్యలకు పాల్పడినట్లు తెలిసిందని అన్నారు.
పన్వేల్ నివాసి అయిన రామేశ్వర్ రాథోడా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు నిందితుడు బెదిరించాడని.. ఇది శాంతి విఘాతాన్ని దారితీసిందని కోర్టు పేర్కొంది. అందుకే నిందితుడికి సంవత్సరం ఏడు నెలల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు తెలిపారు.