ఫేక్ ఐడీల‌తో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఐదుగురి అరెస్ట్

Kurnool Crime News. సైబర్ నేరాలకు పాల్పడుతున్న వ్య‌క్తుల‌ను కర్నూలు సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

By Medi Samrat  Published on  27 Aug 2021 10:51 AM GMT
ఫేక్ ఐడీల‌తో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఐదుగురి అరెస్ట్

సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఐదురురు వ్య‌క్తుల‌ను కర్నూలు సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆఫ్రికాకు చెందిన ముగ్గురు నైజీరియన్లు, మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు మహిళలను కర్నూల్ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శేషయ్య అండ్‌ టీం ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. షెల్ ఆయిల్‌, హెర్బ‌ల్ ఆయిల్‌ పేరుతో ఫేక్ పేస్‌బుక్ ఐడీల ద్వారా మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వ‌ద్ద నుండి నగదు రూ. 12,94,859, 16 బ్యాంక్ అక్కౌంట్ బుక్స్, 33 డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, 2 చెక్ బుక్‌లు, 9 సెల్ ఫోన్స్, 3 లాప్‌టాప్ లు, 3 ఫారిన్ పాస్ పోర్ట్స్, 2 ఆధార్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు.


2020 మే నెలలో ఎమ్మిగనూరు గాంధీనగర్ కు చెందిన చిదానందస్వామి అనే బాధితుడిని ఫేక్ పేస్‌బుక్ ఐడీ ద్వారా ఆన్‌లైన్‌లో పరిచయం చేసుకుని.. మాయ‌మాట‌ల‌తో బోల్తా కొట్టించి మూడు విడతలుగా 2 బ్యాంకు అకౌంట్ లకు మొత్తం రూ. 11,24,000 ట్రాన్స్‌ఫ‌ర్ చేయించుకున్నారు నిందితులు. అనంత‌రం వారివ‌ద్ద నుండి ఎటువంటి స‌మాచారం లేక‌పోవ‌డంతో.. మోస‌పోయాన‌ని గ్ర‌హించిన బాధితుడు సీసీఎస్ పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు.

బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన‌ కర్నూల్ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శేషయ్య అండ్‌ టీం నిందితుల కొరకు ప్రత్యేక బృందంగా ఏర్పడి మ‌హ‌రాష్ట్ర‌, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలలో గాలింపు చర్యలు చేపట్టి ముగ్గురు నైజీరియన్లు, మణిపూర్ రాష్ట్రానికి చెందిన మహిళలను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన ముగ్గురు విదేశీయుల‌ వీసా గ‌డువు ముగిసిన‌ప్ప‌టికీ దేశంలోనే ఉంటున్నారు. వీరిపై ప్రత్యేక చట్టాల క్రింద కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్న‌ట్లు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు.


Next Story