శృంగారం కోసం భాగస్వాముల మార్పిడి.. మహిళ ఫిర్యాదుతో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి..

Kerala Police Arrest 7 in Exchange of Partners. కేరళలో భార్యలను మార్చుకుంటున్న జంటలకు సంబంధించిన విషయం వెలుగులోకి

By Medi Samrat  Published on  9 Jan 2022 11:31 AM
శృంగారం కోసం భాగస్వాముల మార్పిడి.. మహిళ ఫిర్యాదుతో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి..

కేరళలో భార్యలను మార్చుకుంటున్న జంటలకు సంబంధించిన విషయం వెలుగులోకి రావడంతో దుమారం మొదలైంది. ఒక మహిళ కొట్టాయం జిల్లాలోని కరుకాచల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, శృంగారం కోసం భాగస్వాముల మార్పిడికి సంబంధించి ఏడుగురు వ్యక్తులను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి దాకా ఏడుగురిని అరెస్టు చేయగా, 25 మందికి పైగా వ్యక్తులను అబ్జర్వేషన్‌లో ఉంచారు. మరో రెండు రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. 1,000 కంటే ఎక్కువ జంటలు కొన్ని గ్రూప్స్ లో ఉన్నాయి. వారు మహిళలను మార్పిడి చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. నిందితులు రాష్ట్రంలోని మూడు జిల్లాలకు చెందిన వారని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యక్తులు ఈ రాకెట్‌లో భాగమని పోలీసులు తెలిపారు. సమాజంలోని ఉన్నత స్ధాయిలో ఉన్న చాలా మంది వ్యక్తులు ఈ గ్రూప్‌లో ఉన్నారని కూడా వర్గాలు తెలిపాయి.

కొట్టాయంకు చెందిన ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, "మొదట టెలిగ్రామ్, మెసెంజర్ గ్రూపుల్లో చేరి, ఆపై ఇద్దరు లేదా ముగ్గురు జంటలు కలుసుకొనేవారు. ఆ తర్వాత స్త్రీల మార్పిడి జరిగేది. ఒక స్త్రీని ముగ్గురు పురుషులు పంచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కొంత మంది పురుషులు తమ భార్యలను ఒక రోజు శారీరక సంబంధం కోసం.. డబ్బు కోసం అందజేయడంతో గ్రూప్ లోని కొందరు వ్యక్తులు డబ్బులు కూడా ఇచ్చుకునేవారు." ఈ మహిళా ఎక్స్ఛేంజ్ గ్రూప్‌లో పాల్గొన్న వారి వివరాలను రాబట్టేందుకు సవివరమైన విచారణ జరుగుతోందని, ఈ గ్రూపు సభ్యులకుఇతర గ్రూపులతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో సమగ్ర విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.


Next Story