లాడ్జిలో రిసెప్షనిస్ట్ ను అతి దారుణంగా చంపేశారు

Kerala Hotel CCTV Shows Man With Machete Attacking Receptionist. కేరళలోని తిరువంతపురంలో పట్టపగలు ఓ లాడ్జి రిసెప్షనిస్టును కొందరు దుండగులు హత్య చేశారు.

By Medi Samrat  Published on  26 Feb 2022 7:08 AM GMT
లాడ్జిలో రిసెప్షనిస్ట్ ను అతి దారుణంగా చంపేశారు

కేరళలోని తిరువంతపురంలో పట్టపగలు ఓ లాడ్జి రిసెప్షనిస్టును కొందరు దుండగులు హత్య చేశారు. హత్య వెనుక కారణం ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. సమాచారం ప్రకారం, ఈ సంఘటన ఓవర్‌బ్రిడ్జ్‌లోని సిటీ టవర్ హోటల్‌లో చోటు చేసుకుంది. మృతుడు తిరువనంతపురంలోని నాగర్‌కోయిల్‌కు చెందిన అయ్యప్పన్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున కొందరు దుండగులు బైక్‌పై వచ్చి అతడిని దారుణంగా కొట్టారు. టేబుల్ మీద పడేసి కొట్టారు. మారణాయుధాలతో దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు లాడ్జిలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. హత్య చేయాలనే ఉద్దేశంతో దుండగులు ఇక్కడికి వచ్చినట్లు గుర్తించారు.

సమాచారం ప్రకారం, దాడి సమయంలో అయ్యప్పన్ మరియు హోటల్‌లోని రూమ్ బాయ్ మాత్రమే ఉన్నారు. రూమ్ బాయ్ చెత్త విసిరి తిరిగి వచ్చే సమయంలో హత్య వెలుగులోకి వచ్చింది. రక్తంలో తడిసిన అయ్యప్పన్‌ని చూశాడు. దీంతో అతడు హోటల్ యజమానికి ఫిర్యాదు చేశాడు. "సీసీటీవీ విజువల్స్‌లో ఒక వ్యక్తి కొడవలితో హోటల్ రిసెప్షన్‌లోకి వెళ్లి అతన్ని నరికి చంపినట్లు చూపిస్తుంది. హత్య తర్వాత అతను తప్పించుకున్నాడు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది" అని పోలీసులు తెలిపారు.


Next Story
Share it