కీచ‌క తండ్రి.. మైనర్ కూతురిపై ఏడాదిగా అత్యాచారం

Keeps making his own daughter a victim of lust. రాజస్థాన్‌లోని అల్వార్‌లో మైనర్‌పై జరిగిన దారుణ‌ ఘటన ఆల‌స్యంగా వెలుగులోకి

By Medi Samrat  Published on  17 Jan 2022 12:00 PM GMT
కీచ‌క తండ్రి.. మైనర్ కూతురిపై ఏడాదిగా అత్యాచారం

రాజస్థాన్‌లోని అల్వార్‌లో మైనర్‌పై జరిగిన దారుణ‌ ఘటన ఆల‌స్యంగా వెలుగులోకి రావడంతో రాష్ట్రం మరోసారి దద్దరిల్లింది. 16 ఏళ్ల మైనర్ బాలిక.. తన తండ్రి తనపై ఏడాది పాటు అత్యాచారం చేశాడని ఆరోపించింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. 16 ఏళ్ల మైనర్ బాలిక.. త‌న‌ తండ్రి త‌న‌పై ఏడాదిపాటు అత్యాచారం చేశాడని ఉదయ్‌పూర్‌లోని లసాడియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు 11వ తరగతి చదువుతుందని.. కడుపునొప్పి ఉందని చెప్ప‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. చికిత్స అనంత‌రం మైన‌ర్‌ బాలిక వాంగ్మూలాన్ని కోర్టులో నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు ప‌రారీలో ఉన్న‌ బాలిక తండ్రిని అదుపులోకి తీసుకోవ‌డానికి వెతుకుతున్నారు.

బాధితురాలు తన తల్లితో పాటు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తండ్రిపై కేసు పెట్టినట్లు ఎస్‌హెచ్‌ఓ విజేందర్ సింగ్ తెలిపారు. నిందితుడైన‌ తండ్రి డ్రగ్స్‌కు బానిసై వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న తనను గుర్తించిన తన తండ్రి తనపై అనేక‌సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తల్లికి చెబితే చంపేస్తానని తండ్రి తనను బెదిరించేవాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. రెండు రోజుల క్రితం బాధితురాలికి తీవ్ర కడుపునొప్పి రావడంతో విషయం వెలుగులోకి వచ్చిందని.. ఆ తర్వాత తండ్రి చేసిన చేష్టల గురించి తల్లికి చెప్పిందని పోలీసులు తెలిపారు.

నివేదికల ప్రకారం.. తండ్రి కుమార్తెతో పాల్పడిన దుశ్చ‌ర్య‌ తెలిసిన వెంటనే.. తల్లి కుమార్తెను ఆసుపత్రికి తరలించింది. అక్కడ బాలిక‌కు చికిత్స అందించిన తర్వాత.. తల్లి, కుమార్తె ఇద్దరూ నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయడంతో తండ్రి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.


Next Story