కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లాలోని ఓ గ్రామంలో ప్రజలు హృదయ విదారకమైన సంఘటనను చూశారు. ఇక్కడ 20 ఏళ్ల వివాహితను ఆమె ప్రేమికుడు దారుణంగా హత్య చేశాడు. మహిళ నోటిలో పేలుడు పదార్థాలు ఉంచి హతమార్చాడు. దీంతో ఆమె ముఖం బాగా దెబ్బతింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో ఆ ప్రాంతమంతా సంచలనమైంది. లాడ్జి గదిలోని మంచంపై మహిళ మృతదేహం పడి ఉండడంతో గది అంతా రక్తంతో నిండిపోయింది.
మృతురాలిని రక్షితగా పోలీసులు గుర్తించారు. ఆమె గెరసనహళ్లి గ్రామ నివాసి. రక్షిత కేరళకు చెందిన దినసరి కూలీని వివాహం చేసుకుంది. అంతేకాదు, ఆమె తన బంధువు సిద్ధరాజుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. వీరిద్దరూ ఆదివారం భేర్యా గ్రామంలోని ఓ లాడ్జిలో ఉన్నారు. ఇద్దరి మధ్య గొడవ జరగగా.. ఈ క్రమంలో నిందితుడు మహిళ నోటిలో పేలుడు పదార్థాన్ని పెట్టి కుట్రకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ పేలుడు కోసం నిందితుడు గనులలో ఉపయోగించే జిలెటిన్ స్టిక్స్‌లలో వాడే పదార్థాలను ఉపయోగించాడు.
హత్య అనంతరం నిందితుడు మొబైల్ ఫోన్ పేలడం వల్లే మహిళ చనిపోయిందని నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే అతని మాటలు ఎవరూ నమ్మకపోవడంతో అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.