భార్య చికెన్ ఫ్రై వండలేదు.. భర్త ఏం చేశాడంటే..

Karnataka man kills wife for not cooking tasty chicken fry. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకోవడం, ప్రాణాలు తీయడం వంటివి జరుగుతూ

By Medi Samrat  Published on  25 Aug 2021 8:49 AM GMT
భార్య చికెన్ ఫ్రై వండలేదు.. భర్త ఏం చేశాడంటే..

చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకోవడం, ప్రాణాలు తీయడం వంటివి జరుగుతూ ఉంటాయి. భార్య చికెన్‌ ఫ్రై వండలేదని భర్త ఆగ్రహంతో చేసిన పనికి ఆమె ప్రాణాలే పోయాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో నివసిస్తున్న ముబారక్‌ పాషాకు భార్య షిరాను బాను, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆగస్టు 18వ తేదీన చికెన్‌ ఫ్రై వండాలని భార్యకు చెప్పి భర్త బయటకు వెళ్లాడు. అతడు తిరిగి రాగా ఆమె చికెన్‌ ఫ్రై వండలేదు. నిరాశకు గురవ్వడమే కాకుండా భార్యతో గొడవ పడ్డాడు. క్షణికావేశానికి లోనైన భర్త ఆమె తలపై ఓ చెక్కతో బలంగా బాదాడు. ఆ తర్వాత పాషా ఏమీ తెలియనట్టు ఉంటున్నాడు.

అయితే కొన్ని గంటలుగా ఆమె కనిపించకుండాపోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త కదలికలపై నిఘా వేశారు. పోలీసుల విచారణ తీవ్రమవడంతో చివరకు ఆగస్టు చివరకు సోమవారం (ఆగస్ట్‌ 23) నేరుగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని లొంగిపోయాడు. కొట్టిన దెబ్బతో తీవ్ర గాయాలపాలైన భార్య ఇంట్లోనే మృతి చెందిందని.. పిల్లలు రాత్రి నిద్రిస్తుండగా భార్య మృతదేహాన్ని ఓ సంచిలో వేసుకుని బయటకు తీసుకు వెళ్లానని అన్నాడు. బైక్‌పై చిక్కబనవర చెరువుకు చేరుకుని మృతదేహాన్ని నీటిలో పడేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


Next Story
Share it