కుటుంబ సభ్యులను చంపేయడానికి కిరాయి హంతకులతో ప్లాన్.. చివరికి దొరికాడు..!
కర్ణాటకలోని గడగ్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన తండ్రి, సవతి తల్లి, సవతి సోదరుడిని చంపేందుకు కిరాయి హంతకులను నియమించాడు
By Medi Samrat Published on 24 April 2024 9:21 AM ISTకర్ణాటకలోని గడగ్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన తండ్రి, సవతి తల్లి, సవతి సోదరుడిని చంపేందుకు కిరాయి హంతకులను నియమించాడు. కిరాయి గూండాలు ప్లాన్ ప్రకారం హత్య చేయడంతో అతడి కుట్ర కాస్తా బయటకు వచ్చింది. రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయిన వినాయక్ బకాలే (31) తన తండ్రి ప్రకాష్ బకాలే, సవతి తల్లి సునంద, సోదరుడు కార్తీక్ బకాలేలను హత్య చేసేందుకు ఏడుగురితో రూ.65 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. హంతకులు ఇంటిలోకి చొరబడి ముగ్గురిని హత్య చేయాలని ప్లాన్ చేశారు. వారు కేవలం కార్తీక్‌ను మాత్రమే హత్య చేయగలిగారు.. వారు ఇంటికి వచ్చిన కొంతమంది అతిథులను కూడా చంపేశారు. మృతులను కార్తీక్ (27), పరశురాం హదీమణి (55), లక్ష్మి హదీమణి (45), ఆకాంక్ష హదీమణి (16)గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్తి విషయంలో వినాయక్, అతని తండ్రికి తరచూ గొడవలు జరిగేవి. ప్రకాష్ తన ఆస్తులను గతంలో వినాయక్ పేరు మీద పెట్టాడు. అయితే గత ఐదారు నెలలుగా వినాయక్ తన తండ్రిని సంప్రదించకుండా ఆస్తులు అమ్మేశాడు. ఇది కాస్తా గొడవలకు కారమైంది. వినాయక్ సవతి సోదరుడు కార్తీక్ సమాన వాటాదారు కావడంతో వినాయక్ హత్యకు సంబంధించి కుట్రకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. వినాయక్.. ఫైరోజ్ (29), జిషాన్ (24), సాహిల్ (19), సోహైల్ (19), సుల్తాన్ షేక్ (23), మహేష్ సాలుంకే (21), వహీద్ బేపారి (21)లతో హత్యలు చేయించేందుకు డీల్ కుదుర్చుకున్నాడు. ఫైరోజ్ ద్వారా కాంట్రాక్ట్ కిల్లర్‌లకు రూ. 65 లక్షలు ఇస్తామని చెప్పాడు. అయితే వినాయక్ అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయింది. వినాయక్‌తో పాటు ఏడుగురు గూండాలను కూడా అరెస్టు చేశారు.