పారిపోదామన్న ప్రియుడు.. రానన్న ప్రియురాలు.. ఎంత పని చేశాడంటే..
మహిళలాగా వేషంలో వచ్చిన ఒక వ్యక్తి తన ప్రేమికురాలిని తనతోపాటూ తీసుకుని వెళ్లాలని అనుకున్నాడు.
By Medi Samrat Published on 12 March 2025 9:15 PM IST
మహిళలాగా వేషంలో వచ్చిన ఒక వ్యక్తి తన ప్రేమికురాలిని తనతోపాటూ తీసుకుని వెళ్లాలని అనుకున్నాడు. అయితే ఆ వివాహిత నిరాకరించడంతో ఆమెకు నిప్పంటించాడు సదరు వ్యక్తిని పోలీసులు తెలిపారు.
ఆ మహిళ అరుపులు విన్న పొరుగువారు ఆమె ఇంటికి పరిగెత్తుకుంటూ రాగా, నిందితుడు ఉమేష్ (28) టెర్రస్ పై నుంచి దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ తీవ్ర గాయాలపాలయ్యాడని పోలీసులు తెలిపారు. 70 శాతానికి పైగా కాలిన గాయాలతో బాధపడుతున్న రేఖ (30), ఉమేష్ ఇద్దరూ ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.
ఈ సంఘటన జరిగినప్పుడు రేఖ ఇంట్లో ఒంటరిగా టీవీ చూస్తోంది. ఆమె ఏడు, ఐదు సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు పాఠశాలలో ఉన్నారు. ఆమె భర్త సంజు, వ్యవసాయ కూలీ కావడంతో పనికి వెళ్లారని ఫరా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ సంజయ్ కుమార్ పాండే తెలిపారు.మధ్యాహ్నం సమయంలో, హర్యానాలోని హసన్‌పూర్ గ్రామానికి చెందిన ఉమేష్, రేఖ పెద్ద వదిన సోదరుడు, పెట్రోల్ బాటిల్‌తో ఆమె ఇంటికి చేరుకున్నారు. ఉమేష్ ఒక మహిళగా నటిస్తూ.. లెహంగా ధరించి ఉన్నాడు. ఒక స్నేహితుడు మోటారు సైకిల్‌పై గ్రామం సమీపంలో అతడిని దింపాడు. అతను టెర్రస్ నుండి రేఖ ఇంట్లోకి ప్రవేశించి, ఆమె గదిలోకి వెళ్లి తనతో పాటు వచ్చేయాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో, అతను ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని పోలీసులు చెప్పారు.