భార్య చేతిలో భ‌ర్త హ‌తం.. 'నేను చంపి ఉండకపోతే.. నన్ను చంపేవాడు'

జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘ‌ట‌న వెలుగుచూసింది. బాసల్ పోలీస్ స్టేషన్‌లోని లెమ్ గ్రామంలోని మహలి తోలాలో శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ రక్తపుమడుగుగా మారింది.

By -  Medi Samrat
Published on : 20 Dec 2025 2:40 PM IST

భార్య చేతిలో భ‌ర్త హ‌తం.. నేను చంపి ఉండకపోతే.. నన్ను చంపేవాడు

జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘ‌ట‌న వెలుగుచూసింది. బాసల్ పోలీస్ స్టేషన్‌లోని లెమ్ గ్రామంలోని మహలి తోలాలో శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ రక్తపుమడుగుగా మారింది. వేధింపులకు విసిగిపోయిన భార్య కిరణ్ దేవి తన భర్త అశోక్ ఒరాన్‌పై గొడ్డ‌లితో దాడి చేసి హత్య చేసింది. ఈ ఘటన బేసల్ పోలీస్ స్టేషన్ పరిధిలో, చుట్టుపక్కల గ్రామీణ, కొల్లేరు ప్రాంతాల్లో సంచలనం సృష్టించింది.

తన భర్తను హత్య చేసినట్లు అంగీకరించిన కిరణ్ దేవి ఏడుస్తూ తన కథను వివరించింది. మద్యం మత్తులో తన భర్త తరచూ కొట్టేవాడని చెప్పింది. పిల్లలను కూడా వదిలేవాడు కాద‌ని వాపోయింది. తనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని తెలిపింది. పెద్ద కుమార్తె పూజకు 5 సంవత్సరాలు, మ‌రో కుమార్తె మిస్తీకి 3 సంవత్సరాలు.. బాబు అయాన్ష్ వయస్సు 2 సంవత్సరాలని వెల్ల‌డించింది.

భర్త వేధింపులతో విసిగిపోయిన తాను 2018లో తన తల్లి ఇంటికి వెళ్లి, అక్కడ రెండేళ్లు ఉండిపోయాను. ఈ సమయంలో అతడు త‌న త‌ల్లిందండ్రుల‌తో నివసించాడు. దీని త‌ర్వాత అత్తింటి ఒత్తిడితో లెమ్ తిరిగి వ‌చ్చిన‌ట్లు పేర్కొంది. అయినా అత‌డు మార‌లేదు.

నేను అతన్ని చంపకపోతే, నన్ను అక్కడే చంపి ఉండేవాడినని చెప్పింది. చాలా సార్లు చంపాల‌ని ప్రయత్నించాడు కూడా.. కానీ ఎలాగోలా బతికిపోయాను. ఈరోజు విసుగు చెంది ఆత్మరక్షణ కోసం భర్తను హత్య చేయాల్సివ‌చ్చింది. పని చేయ‌డానికి బ‌దులు తాగి పోట్లాడేవాడు.. నేను ఇంటి పనులు, వ్యవసాయ ప‌నులు చూసేదానిన‌ని పేర్కోంది.

తమ కుమారుడి హత్యకు సంబంధించిన సమాచారం అందుకున్న మృతుడి తల్లి దుగ్గి దేవి, తమ్ముడు పియస్ ఓరాన్ లెమ్ మహలి తోలాకు చేరుకున్నారు. ఓర్మాంఝీలోని మృతుడి సోదరి ఇంట్లో ఇద్దరూ ఉన్నారు.

ఇక్కడికి చేరుకోగానే అత్తగారు తొలుత‌ కోడలిని తిట్టింది. నుదిటిపై చేయి వేసుకుని మౌనంగా చాలా సేపు ఏడుస్తూనే ఉంది. కానీ కొడుకును హత్య చేసి పోలీసుల అదుపులో ఉన్న కోడలు కిరణ్ దేవిని చూసి బోరున విలపించింది. పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జికి చెప్పింది.. సార్, దయచేసి తక్కువ శిక్ష వేయండి.. వీళ్ళు చిన్న పిల్లలు, ఎవరు పెంచుతారు? అంటూ ఆమె తన కొడుకును తిట్టింది.

భర్త హత్యకేసులో అరెస్టయిన కిరణ్ తనతో పాటు పసివాడు అయిన అయాన్ష్ (2 సంవత్సరాలు)ని త‌న వెంట తీసుకెళ్లింది. అరెస్టయిన కిరణ్ తన కొడుకును ఒడిలో పెట్టుకుని పోలీస్ స్టేషన్ ఆటోలో కూర్చున్న ఘ‌ట‌న‌ గ్రామ ప్రజల గుండెలను పిండేసింది. కాగా, ఇద్దరు కుమార్తెలు పూజ, మిస్తీలను వారి అమ్మమ్మ పెంచుతారు. మృతుడి తల్లి, సోదరుడు ఇద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

Next Story