ఇండోర్‌లో 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థినిని ఆమె ప్రియుడు హత్య చేసిన కేసులో నివ్వెరపరిచే వివరాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ఆమెను చంపడమే కాకుండా, ఆమె శవంపై అత్యాచారం చేశాడని తేలింది. ఓ వైపు ఆమె శవం పడి ఉంటే పక్కనే మద్యం సేవించాడని కూడా తెలిపారు. ఆమె చనిపోయిన తర్వాత ఆత్మలతో సంభాషించడం ఎలా అనే అంశమై ఆన్‌లైన్‌లో శోధించాడని పోలీసులు వెల్లడించారు.
ఫిబ్రవరి 13న ద్వారకాపురి ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లో దుర్వాసన వస్తోందని పొరుగువారు ఫిర్యాదు చేయడంతో బాధితురాలి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తలుపు పగలగొట్టి చూసేసరికి, ఆమె మంచం మీద నగ్నంగా పడి ఉంది. ఆమె మెడ చుట్టూ తాడుతో బిగించిన గుర్తులు కూడా కనిపించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడిని పియూష్ ధమ్నోడియాగా గుర్తించారు. బాధితురాలి చేతులు, కాళ్ళు కట్టేసి, ఆమె అరవకుండా ఉండటానికి ఆమె నోటిలో ప్లాస్టిక్ నింపాడు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రామ్ కృష్ణల్‌చందాని మాట్లాడుతూ, ఇద్దరూ దాదాపు ఒక సంవత్సరం పాటు ఒకరికొకరు తెలుసునని, రిలేషన్షిప్ లో ఉన్నారని చెప్పారు. నిందితుడు అభద్రతతో ఉన్నాడని, వివాహం విషయంలో తరచుగా ఆమెతో గొడవ పడుతున్నాడని సమాచారం.