ఒక్కోసారి అనుకోని సంఘటనలు చూసి మనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటాం. తాజగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మొరాదాబాద్‌లో చోటు చేసుకుంది. గురువారం రాత్రి పౌరసరఫరాల సంస్థలో ఎలక్ట్రీషియన్‌గా శ్రీకేష్‌ కుమార్‌ను వేగంగా వచ్చి ఓ బైక్‌ ఢీ కొట్టింది. ఆ తర్వాత అతడిని బంధువుల ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ డ్యూటీలో ఉన్న వైద్యులు మరణించినట్లు ప్రకటించారు. మరుసటి రోజు పోస్ట్ మార్టం చేయడానికి ముందు వారు అతనిని మార్చురీలోని ఫ్రీజర్‌లో ఉంచారు. దాదాపు ఏడు గంటల తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు కుటుంబ సభ్యులు సంతకం చేసిన 'పంచనామా' పత్రాన్ని పోలీసులు ఇచ్చే సమయంలో శ్రీకేష్‌ కుమార్ కుటుంబ సభ్యులు అతను బతికి ఉన్నట్లు గమనించారు. దీంతో ప్రమాదం తప్పినట్లైంది.

మొరాదాబాద్ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శివ్ సింగ్ మాట్లాడుతూ.. అత్యవసర వైద్యాధికారి రోగిని తెల్లవారుజామున 3 గంటలకు చూశారు. గుండె చప్పుడు లేదని.. అతను ఆ వ్యక్తిని చాలాసార్లు పరీక్షించానని చెప్పాడు. అందువలన అతను చనిపోయినట్లు ప్రకటించారు. ఉదయం పోలీసు బృందం, అతని కుటుంబ సభ్యులు అతడు బతికి ఉన్నట్లు కనుగొన్నారు. అయితే దీనిపై విచారణకు ఆదేశించామని, ప్రస్తుతానికి అతని ప్రాణాలను రక్షించడమే మా ప్రాధాన్యత అని తెలిపారు. ప్రస్తుతం క్షతగాత్రుడు శ్రీకేష్‌ కుమార్‌ను ఆస్పత్రిలోని వార్డులోకి షిప్ట్‌ చేసి చికిత్స చేస్తున్నారు. అతడు ప్రస్తుతం కోమాలో ఉన్నాడని వైద్యులు తెలిపారు.


అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story