అమానుషం.. మహిళ ప్రైవేట్ భాగాలపై ఇనుప రాడ్డుతో కాల్చిన భర్త, అత్తమామలు
మధ్యప్రదేశ్‌లో ఓ మహిళపై భర్త, అత్తమామలు అతి కిరాతకంగా దాడి చేశారు.
By Medi Samrat Published on 21 Dec 2024 8:09 AM GMTమధ్యప్రదేశ్‌లో ఓ మహిళపై భర్త, అత్తమామలు అతి కిరాతకంగా దాడి చేశారు. ఆమె ప్రైవేట్ భాగాలపై కాల్చిన ఇనుప రాడ్డును ఉంచారు, అంతేకాకుండా కారం పొడిని కూడా ప్రైవేట్ భాగాలపై వేసి హింసించినట్లు పోలీసులు తెలిపారు. రాజ్‌గఢ్‌లోని ఓ ఇంట్లో ఆమెతో మరో వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన అత్తమామలు ఆ మహిళను నిందిస్తూ చిత్రహింసలకు గురిచేశారు. అత్తమామలు, వేధింపులకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఫిర్యాదు ప్రకారం, భర్త, ఆడ పడచు, అత్తమామలు బాధితురాలిని సుమారు రెండు గంటలపాటు చిత్రహింసలు పెట్టారు. తన్నడం, కొట్టడం సహా వేధింపులకు గురిచేస్తూ ఆమెను వివస్త్రగా ఉంచారు.
అత్త బాధితురాలి ప్రైవేట్ భాగాలు, తొడలు, ఇతర శరీర భాగాలను వేడి ఇనుప రాడ్‌తో కాల్చింది. ఇతరులు ఆమె ప్రైవేట్ భాగాలపై కారం పోశారు. డిసెంబర్ 13న ఈ ఘటన చోటు చేసుకుంది. మరుసటి రోజు భర్త బాధితురాలిని బైక్‌పై తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ సమీపంలో వదిలిపెట్టారు. అయితే ఆ మహిళ తన తల్లిదండ్రుల ఇంటికి చేరుకుని జరిగిన ఘోరాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ప్రకారం రోహిత్ రుహేలా అనే వ్యక్తి మహిళ ఇంటికి వచ్చి ఆవిరి యంత్రం కావాలని అడిగాడు. బాధితురాలు అతన్ని గేటు దగ్గర వేచి ఉండమని చెప్పింది. అతను తలుపులు మూసివేసి, ఆమె గదిలోకి ప్రవేశించి వేధింపులకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆడ పడచు వచ్చి చూడగా రోహిత్ అక్కడి నుండి పారిపోయాడు. అప్పటి నుండి బాధితురాలిపై అనుమానం పెంచుకున్న భర్త కుటుంబం టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది.