టోలీచౌకీలో ఘోర ప్రమాదం.. 5 అంతస్థుల భవనం కూలి ముగ్గురు మృతి

హైదరాబాద్ నగరంలోని టోలీచౌకీలో ఐదంతస్తుల భవనం కుప్పకూలింది.

By -  Medi Samrat
Published on : 5 March 2026 5:32 PM IST

టోలీచౌకీలో ఘోర ప్రమాదం.. 5 అంతస్థుల భవనం కూలి ముగ్గురు మృతి

హైదరాబాద్ నగరంలోని టోలీచౌకీలో ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు.

టోలీచౌకీ అల్ హస్నాత్ కాలనీలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్థుల భవనం కూలిపోవడంతో స్థానికులు భయాందోళనచెందుతున్నారు . గాయపడిన వారిలో కొందరు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Next Story