ఫోన్లను దొంగిలిస్తున్నారనే ఆరోపణలపై ఫిబ్రవరి 28, శుక్రవారం ఇద్దరు వ్యక్తులను ఎస్‌ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. 4.5 లక్షల విలువైన 28 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కట్టా నవీన్, విట్టల రాజుగా గుర్తించారు. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో వీరు దొంగతనాలకు పాల్పడ్డారు.
నిందితుడు నవీన్ సెక్యూరిటీ లేని హాస్టళ్లను లక్ష్యంగా చేసుకునేవాడు. రాత్రిపూట గదుల్లోకి వెళ్లి మొబైల్ ఫోన్‌లను దొంగిలించేవాడు. దొంగిలించబడిన ఫోన్ లను తన సహచరుడు విట్టల రాజుకు విక్రయించేవాడు. గత మూడు నెలలుగా నిందితులు ప్రధానంగా హాస్టళ్లు, బ్యాచిలర్ వసతి గృహాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. ఎస్ఆర్ నగర్, దుండిగల్, మేడ్చల్ పోలీస్ స్టేషన్లలో వారిపై కేసులు నమోదయ్యాయి.