Hyerabad : చదివింది 7వ తరగతి.. గుట్టు చ‌ప్పుడు కాకుండా ఆ దందా చేస్తున్నాడు..!

మీర్ చౌక్ పోలీసులు జరిపిన దాడిలో నూర్ ఖాన్ బజార్‌లోని ఒక గోడౌన్ నుండి నకిలీ కాస్ట్రోల్ ఇంజిన్ ఆయిల్‌ను తయారు చేసి అమ్ముతున్నందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.

By Medi Samrat
Published on : 18 April 2025 9:22 PM IST

Hyerabad : చదివింది 7వ తరగతి.. గుట్టు చ‌ప్పుడు కాకుండా ఆ దందా చేస్తున్నాడు..!

మీర్ చౌక్ పోలీసులు జరిపిన దాడిలో నూర్ ఖాన్ బజార్‌లోని ఒక గోడౌన్ నుండి నకిలీ కాస్ట్రోల్ ఇంజిన్ ఆయిల్‌ను తయారు చేసి అమ్ముతున్నందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. బేగమ్ బజార్‌లోని ఫీల్‌ఖానా నివాసి 32 ఏళ్ల షేక్ ఖయ్యూమ్ నకిలీ ఇంజిన్ ఆయిల్‌ను తయారు చేసి స్థానిక ఆటో వర్క్‌షాప్‌లకు తక్కువ ధరలకు అమ్ముతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు మొత్తం 710 లీటర్ల నకిలీ ఇంజిన్ ఆయిల్, రూ. 3 లక్షల విలువైన ప్యాకేజింగ్ మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో 480 లీటర్ల నకిలీ కాస్ట్రోల్ యాక్టివ్ ఇంజిన్ ఆయిల్, 340 ఖాళీ పెట్టెలు, 340 నకిలీ కాస్ట్రోల్ లేబుల్ స్టిక్కర్లు, 340 నకిలీ క్యాప్‌లు, బార్‌కోడ్ స్టిక్కర్లు ఉన్నాయి. 7వ తరగతి వరకు చదువుకున్న ఖయ్యూమ్, గతంలో టెంపో మెకానిక్‌గా, తరువాత ఆటో డ్రైవర్‌గా పనిచేశాడు. తన కుటుంబానికి తగినంత సంపాదించడం కష్టమని భావించి, హైదరాబాద్‌లో అధిక మార్కెట్ డిమాండ్ ఉన్న కాస్ట్రోల్ బ్రాండ్ కింద నకిలీ ఇంజిన్ ఆయిల్‌ను అమ్మడం మొదలు పెట్టాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనను అతను ఈ పని చేశాడు.

Next Story