హైదరాబాద్‌లో లేడీ డాక్టర్ 'హిట్ అండ్ రన్..బాధితుడి పరిస్థితి విషమం

హైదరాబాద్ నగరంలో దారుణమైన హిట్ అండ్ రన్ ఘటన వెలుగులోకి వచ్చింది.

By -  Knakam Karthik
Published on : 6 March 2026 2:10 PM IST

Crime News, Hyderabad, Hit And Run, Lady Doctor, Road Accident, Hyderabad Police

హైదరాబాద్‌లో లేడీ డాక్టర్ 'హిట్ అండ్ రన్..బాధితుడి పరిస్థితి విషమం

హైదరాబాద్ నగరంలో దారుణమైన హిట్ అండ్ రన్ ఘటన వెలుగులోకి వచ్చింది. నిలోఫర్ ఆసుపత్రికి చెందిన మహిళా డాక్టర్ బెక్కం విజయ నిర్మల, తన కారుతో స్కూటీని బలంగా ఢీకొట్టి ఆపకుండా పరారయ్యారు. గత నెల 2వ తేదీన గాంధీ నగర్ పరిధిలోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బాధితుడు బీరం కృష్ణ స్కూటీపై వెళ్తుండగా, డాక్టర్ విజయ నిర్మల ప్రయాణిస్తున్న కారు (TS08HL4682) వేగంగా వచ్చి ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కృష్ణకు తీవ్ర గాయాలవ్వగా, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కనీసం మానవత్వంతో బాధితుడిని ఆసుపత్రికి తరలించకుండా డాక్టర్ పరారు కావడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సదరు కారును తక్షణమే సీజ్ చేసి, నిందితులను అరెస్టు చేయాలని బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.

Next Story