విడాకుల కేసులో ఓ భర్త తన భార్యతో ప్రవర్తించిన తీరుతో కోర్టు కదిలింది. నాగ్‌పూర్ కోర్టు వెంటనే ఆ మహిళకు భర్త నుంచి విడాకులు మంజూరు చేసింది. నాగ్‌పూర్‌లోని ఓ ఫ్యామిలీ కోర్టు భర్త క్రూరత్వానికి గురైన 22 ఏళ్ల బాధితురాలికి విడాకులు మంజూరు చేసింది. క్రూరమైన భర్త బారి నుండి ఆమెను విడిపించింది. మహరాష్ట్రలోని వాడిలో నివాసముంటున్న 28 ఏళ్ల యువకుడికి.. 2017లో వనడోంగ్రికి చెందిన యువతితో వివాహమైంది.
అతడు మద్యానికి బానిసయ్యాడు. అంతేకాదు తాను శృంగారంలో పాల్గొనేందుకు నిరాకరించినప్పుడు, అతడు చేతులు, కాళ్ళు కట్టివేసి బలవంతంగా సెక్స్ చేసేవాడని.. తాను అరవకుండా, కేకలు వేయకూడదని నోట్లో బట్టలు కుక్కేవాడని ఆమె ఆరోపించింది. ఇలా జరుగుతుండగా ఆ యువతి విషయం అత్తకు చెప్పింది. ఇకపై అలా జరగదని అత్త ఆమెకు హామీ ఇచ్చింది. దీంతో ఆమె అత్త దగ్గరే ఉండిపోయింది. అయితే ఆ తర్వాత భర్త మళ్లీ అలానేచేయడం మొదలుపెట్టాడు. అంతేకాదు.. మొదటిసారికి భిన్నంగా భర్త ప్రవర్తన మరింత దిగజారింది. డబ్బు తీసుకురావాలని భార్యపై ఒత్తిడి తెచ్చి ఆమెపై అనుమానం వ్యక్తం చేసేవాడు. రోజూ కొడుతూ హింసించసాగాడు. దీంతో భర్తపై యువతి కోర్టును ఆశ్రయించింది. విడాకులకు దరఖాస్తు చేసి తనకు విడాకులు ఇప్పించాలని వేడుకుంది.
ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు యువతికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆమెకు విడాకులు మంజూరయ్యాయి. బాధితురాలి వయస్సు చిన్నదని.. ఇంత చిన్న వయసులో ఇలాంటి క్రూరత్వాన్ని ఎవరూ సహించరు. భార్యను మీ బానిసగా భావించవద్దని కోర్టు సందేశంలో పేర్కొంది. మనం మన భార్యను గౌరవించాలి, ప్రేమగా చూసుకోవాలి. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13 (1) (ఎ) ప్రకారం, భార్య భర్తపై పిటిషన్ దాఖలు చేసి.. అతని క్రూరత్వం రుజువైనట్లయితే.. కోర్టు విడాకులు మంజూరు చేయవచ్చు.