భార్యను చంపి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.. త‌ర్వాత‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లి..

Husband reaches police station on his own after wife's murder. వారి పెళ్లి జరిగి నెలలు గడిచాయి.. ఇంతలోనే భర్త భార్యను హతమార్చాడు.

By Medi Samrat  Published on  8 Jan 2022 12:45 PM GMT
భార్యను చంపి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.. త‌ర్వాత‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లి..

వారి పెళ్లి జరిగి నెలలు గడిచాయి.. ఇంతలోనే భర్త భార్యను హతమార్చాడు. అతడే ఫోన్ చేసి భార్య మరణానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత పోలీసు స్టేషన్ కు వెళ్లి సరెండర్ అయ్యాడు. హత్య చేసిన భర్త స్వయంగా 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించి పోలీసు స్టేషన్ వద్దకు వెళ్లాడు. తన భార్యను గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. తొలుత మానసిక వ్యాధిగ్రస్థుడిగా భావించిన పోలీసు సిబ్బంది.. ఆ తర్వాత అతడి ఇంటికి వెళ్లి చూసే సరికి మంచంపై భార్య మృతదేహం పడి ఉంది. నేరస్థుడైన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి అత్త, మామ, బావ, ఇద్దరు వ్యక్తులపై కూడా కేసు నమోదు చేశారు.

ఖేడా నివాసి ఫర్హా (26), బైద్‌పురా నివాసి మష్కూర్ అలీతో అక్టోబర్ 24, 2020న వివాహం జరిగింది. పెళ్లయినప్పటి నుంచి మష్కూర్ పెద్ద కారు, రూ. 5 లక్షలు డిమాండ్ చేస్తున్నాడని ఫర్హా కుటుంబ సభ్యులు ఆరోపించారు. కట్నం ఇవ్వలేదని ఫర్హాపై దాడి చేశారు. ఈ విషయాన్ని ఫర్హా కొన్ని రోజుల క్రితం తన తల్లికి కూడా చెప్పింది. గురువారం ఉదయం ఏదో విషయంపై భార్యపై దాడి చేశాడు. తర్వాత ఆమె గొంతు కోసి చంపాడు. నేరస్థుడు స్వయంగా రుద్రాపూర్ పోలీసు స్టేషన్ కు చేరుకున్నాడు, అక్కడ అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యను గుర్తించిన ఫర్హా తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. మృతురాలి తండ్రి రియాజుద్దీన్ తన అల్లుడు మష్కూర్ కుటుంబం కట్నంతో సంతోషంగా లేరని పోలీసులకు సమాచారం అందించారు. వరకట్నం ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని ఫర్హా తన తండ్రికి ఏడు రోజుల క్రితం తెలిపింది. తన కూతురు అపస్మారక స్థితిలో పడి ఉందని అల్లుడి తండ్రి గురువారం ఉదయం ఫోన్‌లో చెప్పాడని.. ఆ తర్వాత కూతురు శవమై కనిపించిందని ఫర్హా తండ్రి వాపోయాడు.


Next Story