పెళ్లైన నెల రోజులకే దారుణం.. కట్నం కోసం భార్య ప్రైవేట్ భాగాలపై యాసిడ్ పోసి..
Husband Poured Acid on wife Private Parts. దిగ్భ్రాంతికరమైన క్రైమ్ ఘటనలు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి.
By Medi Samrat Published on 26 Feb 2022 2:53 PM GMT
దిగ్భ్రాంతికరమైన క్రైమ్ ఘటనలు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మహిళలపై దారుణాలు పెరిగిపోతూనే ఉన్నాయి. పెళ్లి అయిన నెల రోజులకే కట్నం డిమాండ్ చేశాడు ఓ యువకుడు. అంతే కాకుండా తన భార్య ప్రైవేట్ భాగాలపై యాసిడ్ పోశాడు. ఆ తర్వాత బాధితురాలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. చికిత్స కోసం మహిళను సివిల్ ఆసుపత్రిలో చేర్చారు. మహిళ సోదరుడు పోలీసులకు ఈ దారుణం గురించి చెప్పుకొచ్చాడు. లుధియానాలోని జస్సియన్ రోడ్డులో నివాసం ఉంటున్న వ్యక్తితో తన సోదరికి నెల రోజుల క్రితం వివాహమైందని తెలిపాడు.
అదే సమయంలో పెళ్లయిన ఐదు రోజులకే వరకట్నం కావాలని అక్కను వేధించడం మొదలుపెట్టాడు. అతను ప్రతిరోజూ తన సోదరిని కొడుతూనే ఉన్నాడు. ఈ కారణంగా, ఆమె మనస్తాపం చెంది తన తల్లి ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత నచ్చజెప్పి పంపించగా.. మరోసారి కొట్టి, వారం రోజుల క్రితం ఆమెను కొట్టి ఇంటి నుంచి గెంటేశారు. ఇంతలో బుధవారం అబ్బాయి తరపున వాళ్లు వచ్చి యువతిని వెంట తీసుకెళ్లారు. ఆమె అత్తమామల ఇంటికి చేరుకోగానే భర్త మళ్లీ కొట్టి శరీరంపై యాసిడ్ పోశాడని సోదరుడు ఆరోపించాడు. యువతి సోదరుడు మాట్లాడుతూ.. తనకు రాత్రి కాల్ వచ్చిందని, ఆ తర్వాత ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పాడు. ఇప్పుడు ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.