Video : చేతులు జోడించి అడుక్కున్నా వదలని 'భార్య'

ఒక రైల్వే ఉద్యోగి తన భార్యపై గృహ హింసకు పాల్పడిందని ఆరోపిస్తూ పన్నా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కు ఫిర్యాదు చేశాడు.

By Medi Samrat
Published on : 2 April 2025 8:24 PM IST

Video : చేతులు జోడించి అడుక్కున్నా వదలని భార్య

ఒక రైల్వే ఉద్యోగి తన భార్యపై గృహ హింసకు పాల్పడిందని ఆరోపిస్తూ పన్నా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కు ఫిర్యాదు చేశాడు. 30 ఏళ్ల లోకో పైలట్ లోకేష్ మాంఝీ తన భార్య హర్షిత తనపై శారీరకంగా దాడి చేసింద‌ని ఆరోపించాడు. తన వాదనకు మద్దతుగా రహస్య కెమెరాతో రికార్డ్ చేసిన వీడియో ఆధారాలను సమర్పించాడు.

మాంఝీ జూన్ 2023లో హర్షితను వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగినప్పటి నుండి తన భార్య, అత్త, బావమరిది డబ్బు, నగలు డిమాండ్ చేస్తున్నారని అతను ఆరోపించాడు. మాంఝీ.. “నా భార్య నన్ను కొడుతుంది, దయచేసి నాకు సహాయం చేయండి సార్” అని కోరుతూ పోలీసులను ఆశ్రయించాడు. వైరల్ వీడియోలో ఆ మహిళ అతనిపై దారుణంగా దాడి చేయ‌డం చూడవచ్చు. మరొక మహిళ ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఆమె వినడం లేదు. లోకేశ్ అడుక్కుంటున్నా కూడా ఆమె వినలేదు.

ఈ సంఘటన మాంఝీ ప్రస్తుతం నివసిస్తున్న సత్నాలో జరిగింది. మార్చి 20, 2025న సాత్నా పోలీసులకు మాంఝీ తన మీద దాడి చేసిందంటూ నివేదించాడు. పోలీసులకు చెబితే ఆత్మహత్య చేసుకుంటానని, బిడ్డకు హాని చేస్తానని భార్య బెదిరించిందని వాపోయాడు.


Next Story