57 ఏళ్ల భర్త.. 52 సంవత్సరాల భార్యను దారుణ హత్య
Husband killed wife in mutual dispute. దక్షిణ ఢిల్లీలోని సాకేత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో చోటు చేసుకున్న వివాదంలో
By Medi Samrat Published on 23 Jan 2022 7:32 PM IST
దక్షిణ ఢిల్లీలోని సాకేత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో చోటు చేసుకున్న వివాదంలో 57 ఏళ్ల వ్యక్తి.. అతని 52 ఏళ్ల భార్య ప్రాణాలు తీశాడు. గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు. పోలీసులకు ఈ ఘటన గురించి మహిళ మేనల్లుడు ఫోన్ చేసి చెప్పాడు. పోలీసులు మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు.
శుక్రవారం సాయంత్రం సాకేత్ పోలీస్ స్టేషన్‌కు కాల్ వచ్చింది.. పివిఆర్ వెనుక ఉన్న ఫ్లాట్‌లో నివసించే తన అత్త శశీలతా పాండే (52), ఆమె భర్త చంద్రభూషణ్ పాండే (57) మధ్య గొడవ జరిగిందని కాల్ చేసిన వ్యక్తి పోలీసులకు చెప్పాడు. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. యువకుడు వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేసి ఆసుపత్రికి తరలించారు. ఆమె భర్త ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మహిళ చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా నేలపై మొత్తం రక్తం ఉంది.
ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ బృందం విచారణ మొదలు పెట్టింది. డ్రాయింగ్ రూమ్‌లో రక్తంతో తడిసిన వంటగది కత్తి కనుగొనబడింది. సంఘటనా స్థలం నుండి సంబంధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎయిమ్స్ మార్చురీలో ఉంచారు. ఈ నేపథ్యంలో భర్తపై ఐపీసీ సెక్షన్ 302 కింద పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. గొడవకు కారణం ఏమిటనే విషయాన్ని ఇంకా ఆరా తీస్తున్నారు.