దారుణం : భార్యను చంపి.. ముక్కలు ముక్కలు చేసి..!
Husband Killed Wife In Bihar. బీహార్‌లో అక్రమ సంబంధం ఆరోపణలతో భర్త పదునైన ఆయుధంతో భార్యను దారుణంగా
By Medi Samrat Published on 7 Feb 2022 11:47 AM GMTబీహార్‌లో అక్రమ సంబంధం ఆరోపణలతో భర్త పదునైన ఆయుధంతో భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన బంకా జిల్లాలోని తాహిర్‌పూర్‌లో చోటుచేసుకుంది. భర్త తీవ్ర ఆగ్రహంతో భార్యను చంపిన తర్వాత మృతదేహాన్ని పలు ముక్కలుగా నరికి తీసుకెళ్లి నది ఒడ్డున ఓ గొయ్యిలో పూడ్చిపెట్టాడు. చనిపోయిన మహిళ పేరు రీమా దేవి. ఆమెకి హేమంత్ యాదవ్ అనే యువకుడితో వివాహమైంది. పెళ్లయినప్పటి నుంచి రీమాదేవితో హేమంత్ యాదవ్‌కు సరైన అనుబంధం లేదు. మరో మహిళతో హేమంత్ యాదవ్ అక్రమ సంబంధం పెట్టుకోవడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇరువురి మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు పలుమార్లు ప్రయత్నించినా సద్దుమణగలేదు.
ఆ తర్వాత హేమంత్ యాదవ్ భార్యను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత నది ఒడ్డున బురదలో పూడ్చిపెట్టాడు. అయితే అతను కొన్ని రోజుల తర్వాత శవానికి సంబంధించిన భాగాలు బయటకు వచ్చాయి. దీంతో వందలాది మంది జనం గుమిగూడారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గుంతలోంచి మృతదేహాన్ని బయటకు తీసి స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు హేమంత్ యాదవ్ తన స్నేహితులతో కలిసి ఈ ఘటనకు పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు. హత్య జరిగినప్పటి నుంచి నిందితుడు భర్త హేమంత్ పరారీలో ఉన్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం హత్య జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆదివారం మృతదేహాన్ని వెలికితీసి మృతురాలి బంధువులకు సమాచారం అందించారు.