భార్యను కొరడాతో కొట్టి చంపేసిన భర్త

Husband kill Wife. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో ఓ భర్త తన భార్యను కొరడాతో కొట్టి చంపేశాడు.

By Medi Samrat  Published on  20 April 2022 1:15 PM GMT
భార్యను కొరడాతో కొట్టి చంపేసిన భర్త

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో ఓ భర్త తన భార్యను కొరడాతో కొట్టి చంపేశాడు. సంతానం లేని కారణంగా తమ కుమార్తెను ప్రజలు అవహేళన చేసి మాట్లాడేవారని, ఆమె భర్త పదేపదే అబార్షన్ చేయించిన కారణంగా కుమార్తెకు బిడ్డలు లేరని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పిల్లలు పుట్టట్లేదనే కోపంతో కుమార్తెను హత్య చేశారని చనిపోయిన మహిళ తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడైన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.

సెరమౌ దక్షిణ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌహ్నాపూర్ గ్రామంలో, హరి కాంత్ త్రిపాఠి అనే వ్యక్తి తన భార్య పింకీ త్రిపాఠిని విచక్షణా రహితంగా కొట్టి హత్య చేశాడు. తమ కుమార్తెకు సంతానం లేదని ప్రజలు అవహేళన చేశారని, అయితే ఆమె భర్త ఆమెకు అబార్షన్ చేయిస్తున్నాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో గొడవ తీవ్రరూపం దాల్చడంతో భర్త ఆమెను హత్య చేశాడు. ఈ విషయమై జిల్లా ఎస్పీ ఎస్.ఆనంద్ మాట్లాడుతూ.. పింకీ త్రిపాఠి అనే మహిళ మృతదేహం రక్తపుమడుగులో ఆమె ఇంట్లో పడి ఉన్నట్టు తమకు సమాచారం అందిందని చెప్పారు.

మృతురాలి సోదరుడు కూడా ఫిర్యాదు చేశాడు, అందులో నిందితుడు హరికాంత్ త్రిపాఠికి తన మొదటి భార్య నుండి ఇద్దరు కుమారులు ఉన్నారని, పింకీ అతనికి రెండవ భార్య అని చెప్పాడు. హరికాంత్ త్రిపాఠి ఢిల్లీలోని బదర్‌పూర్ ప్రాంతంలో నివాసి. కొద్దిరోజుల క్రితం భార్య పింకీతో కలిసి గ్రామానికి చేరుకున్నాడు. ఇరువురి మధ్య పలుమార్లు గొడవలు జరగడంతో భర్త హత్య చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడైన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story
Share it