మహిళపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం.. ప్రైవేట్‌ భాగాల్లో సిగరెట్లతో కాల్చి

Husband, friends sexual assault woman, burnt her with cigarettes. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో ఓ మహిళపై ఆమె భర్త, అతని నలుగురు స్నేహితులు సామూహిక అత్యాచారం చేసి

By అంజి  Published on  17 Jan 2022 5:16 AM GMT
మహిళపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం.. ప్రైవేట్‌ భాగాల్లో సిగరెట్లతో కాల్చి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో ఓ మహిళపై ఆమె భర్త, అతని నలుగురు స్నేహితులు సామూహిక అత్యాచారం చేసి చిత్రహింసలకు గురిచేశారని పోలీసులు ఆదివారం తెలిపారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. 32 ఏళ్ల మహిళ తన భర్త, ఇతరులు అసహజ శృంగారం చేసి, తన ప్రైవేట్ భాగాలను సిగరెట్‌తో కాల్చుతూ తనను క్రూరంగా హింసించారని బాధితురాలు పేర్కొంది. లైంగిక వేధింపులను ఆమె ప్రతిఘటించడంతో వారు ఆమెను చంపేస్తామని బెదిరించారని ఎఫ్‌ఐఆర్‌లో తెలిపింది.

నవంబర్ 201, అక్టోబర్ 2021 మధ్య ఇండోర్‌లోని షిప్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఫామ్‌హౌస్‌లో సామూహిక అత్యాచారం జరిగిందని అధికారి తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మహిళ, ఇండోర్‌కు చెందిన నిందితుడిని మ్యాట్రిమోనియల్ సైట్‌లో కలిసిన తర్వాత వివాహం చేసుకుంది. అయితే ఆ వ్యక్తికి అప్పటికే పెళ్లయిందని పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. ఎలాగోలా ఫామ్‌హౌస్ నుంచి తప్పించుకుని ఛత్తీస్‌గఢ్‌లోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లినట్లు ఫిర్యాదుదారు పోలీసులకు తెలిపారు. అయితే నిందితుల్లో ఒకరు ఆమెకు హాని చేయాలనే ఉద్దేశంతో ఆమెను అనుసరించారని అధికారి తెలిపారు. బాధితురాలి భర్తతో సహా ఐదుగురిపై భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోని వివిధ ప్రాంతాల నుండి అరెస్టు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని ఆయన చెప్పారు.

Next Story