ఇంటి అద్దె కోసం.. ఓనర్‌తో ఎఫైర్‌ పెట్టుకోవాలని భార్యపై భర్త ఒత్తిడి

Husband forced woman to have a physical relationship with owner. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో భార్యభర్తల బంధంలో సిగ్గుమాలిన ఘటన వెలుగు చూసింది.

By అంజి  Published on  28 Nov 2021 2:05 PM IST
ఇంటి అద్దె కోసం.. ఓనర్‌తో ఎఫైర్‌ పెట్టుకోవాలని భార్యపై భర్త ఒత్తిడి

రోజు రోజుకి మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ఇక భార్యభర్తల మధ్య సంబంధాలైతే మరింత దిగజారిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో భార్యభర్తల బంధంలో సిగ్గుమాలిన ఘటన వెలుగు చూసింది. నగరంలోని లిసాడి గేట్ శ్యామ్‌నగర్‌కు చెందిన ఓ మహిళ తన భర్తపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇంటి యజమానితో శారీరక సంబంధం పెట్టుకోవాలని తన భర్త బలవంతం చేశాడని భార్య ఆరోపించింది. భర్త మాటను భార్య వ్యతిరేకించడంతో ట్రిపుల్ తలాక్ చెప్పి భర్త పారిపోయాడు.

శాస్త్రినగర్‌లో నివాసం ఉండే మహిళ, శ్యామ్‌నగర్‌కు చెందిన వ్యక్తితో 6 ఏళ్ల క్రితం వివాహమైంది. వారిద్దరికీ ఇద్దరు పిల్లలు. భర్త మద్యం మత్తులో ఉన్నాడని, ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని మహిళ తెలిపింది. అద్దె మాఫీ చేసుకునేందుకు ఇంటి యజమానితో శారీరక సంబంధం పెట్టుకోవాలని చాలా రోజులుగా ఒత్తిడి తెస్తున్నాడని చెప్పింది. ఆమె అడ్డు చెప్పడంతో.. నిందితుడు అయిన భర్త ఆమెను కొట్టి ట్రిపుల్ తలాక్ చెప్పి పారిపోయాడు. అయితే ఈ విషయాన్ని ఆ మహిళ ఇరుగుపొరుగున ఉంటున్న అత్తమామలకు తెలియజేయడంతో వారు కూడా ఆమెను కొట్టారు. లిసాడి గేట్ పోలీస్ స్టేషన్‌లో మహిళ ఫిర్యాదు చేసింది. ఈ విషయమై ఫిర్యాదు అందినట్లు ఇన్‌స్పెక్టర్ లిసాడి గేట్ ఉత్తమ్ సింగ్ రాథోడ్ తెలిపారు. విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

Next Story