మానవబాంబుగా మారి భార్యనే పేల్చేసిన భర్త

Husband becomes 'human bomb' and blows up wife. గుజరాత్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యను చంపేందుకు ఓ భర్త ఏకంగా

By Medi Samrat  Published on  27 Feb 2022 2:34 PM IST
మానవబాంబుగా మారి భార్యనే పేల్చేసిన భర్త

గుజరాత్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యను చంపేందుకు ఓ భర్త ఏకంగా మానవ బాంబుగా మారాడు. ఆరావళి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. గొడవల కారణంగా భార్యాభర్తలు విడివిడిగా నివసిస్తున్నారు. దీంతో భార్యను చంపేందుకు భర్త ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా ఛాతీపై జిలెటిన్‌ స్టిక్స్‌ పెట్టుకుని భార్యను కౌగిలించుకున్నాడు. అత్యంత ప్రమాదకరమైన పేలుడుకు దారితీసింది, దీంతో ఇద్దరూ మరణించారు. లాలా పాఘి అనే వ్యక్తి తనతో జీవించడానికి సిద్ధంగా లేనందున తన భార్య శారదను హత్య చేశాడు.

45 రోజుల క్రితం లాలా పాఘి ఇంటిని విడిచిపెట్టి, శారద తన తండ్రితో కలిసి అహ్మదాబాద్‌కు 135 కిలోమీటర్ల దూరంలోని మేఘరాజ్ పట్టణంకు వచ్చేసింది. శారీరకంగా, మానసికంగా హింసించడం వల్లే తన సోదరి శారద లాలా పాఘి ఇంటి నుంచి తిరిగి వచ్చిందని ఆమె సోదరుడు ఆరోపించారు.

గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో లాలా పాఘి శారదను కలిసేందుకు వచ్చాడు. శారద తన తండ్రి ఇంట్లోనే ఉంటోంది. ఆమె అతనిని కలవడానికి బయటకు వచ్చినప్పుడు, అతను ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. అప్పుడు ప్రమాదకరమైన పేలుడు సంభవించింది. ఆ ప్రాంతమంతా పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. శారద అక్కడికక్కడే చనిపోయింది, కొద్దిసేపటికే లాలా పాఘి కూడా చనిపోయాడని ఇన్‌స్పెక్టర్ సీపీ వాఘేలా తెలిపారు. ఈ దంపతులకు 21 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.




Next Story